ఈసారి చిరంజీవి ఓటు ఎవరికి?

Mega-Star-Chiranjeevi-On-about-His-152nd-Movie-Heroines-Andhra-Talkies
సీనియర్లకు హీరోయిన్లు దొరకడం కష్టంగా మారిన రోజులివి. బాలయ్య - వెంకటేశ్ - నాగార్జున - చిరంజీవి లాంటి హీరోలకు హీరోయిన్లు దొరికితే చాలు - అదే పదివేలు అనుకునే పరిస్థితి. అయితే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమాకు మాత్రం హీరోయిన్ల కొరత ఉన్నట్టు కనిపించడం లేదు. ఎఁదుకంటే తాజా గాసిప్స్ ప్రకారం ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి.

మొన్నటివరకు ఈ ప్రాజెక్టు కోసం నయనతార పేరు పరిశీలిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ప్రస్తుతం సైరా సినిమా చేస్తున్న నయనతారను అలానే కంటిన్యూ చేస్తారంటూ పుకార్లు వచ్చాయి. కానీ అంతలోనే అనుష్క పేరు తెరపైకి వచ్చింది. గతంలో చిరంజీవి నటించిన ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన అనుష్క - ఈసారి చిరంజీవి కోరితే నటించడానికి అభ్యంతరం చెప్పకపోవచ్చు.

ఓవైపు అనుష్కతో చర్చలంటూ వార్తలొస్తుండగానే మరోవైపు త్రిష పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చిరు సరసన స్టాలిన్ సినిమాలో నటించిన ఈ చెన్నై సుందరి కూడా మెగాస్టార్ సరసన నటించడానికి రెడీనే. మరి వీళ్లలో ఎవర్ని చిరు సెలక్ట్ చేస్తాడో చూడాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...