మెగాస్టార్ 152 భామలు వీళ్లేనా?

Nayanthara-and-Tamanna-Heroines-for-Chiranjeevi-152nd-Film-Andhra-Talkies
Nayanthara-and-Tamanna-Heroines-for-Chiranjeevi-152nd-Film-Andhra-Talkies
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 151వ సినిమా `సైరా-నరసింహారెడ్డి` ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే 152వ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీలోనే ఉంటుందని రామ్ చరణ్ కాన్ ఫామ్ చేశాడు. వరుస విజయాలతో దూకుడు మీదున్న కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని నిర్మాత హోదాలో అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి చిరంజీవి కోసం స్క్రిప్టును ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. మెగాస్టార్ స్టార్ డమ్ కి తగ్గట్టే ఈసారి కథను ఎంచుకున్నాడు. వర్తమాన రాజకీయాలు - రైతు సమస్యల నేపథ్యంలో కథాంశం ఉంటుందని ఇదివరకూ లీకులు అందాయి.

ప్రస్తుతం చిరు సరసన నటించే భామల కోసం కొరటాల చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నాడట. ఇప్పటికే నయనతార - తమన్నా లాంటి సీనియర్ భామలతో కొరటాల  మంతనాలు సాగిస్తున్నారని ప్రచారమవుతోంది. తమన్నా ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఎగ్జయిట్ మెంట్ తో ఉంది. అయితే నయనతార మాత్రం కాల్షీట్లను సర్ధుబాటు చేయాల్సి ఉందని తెలుస్తోంది. నయన్ ఇప్పటికే చిరు సరసన `సైరా` చిత్రంలో నటిస్తోంది. అటు తమిళంలోనూ పలు భారీ ప్రాజెక్టులు చేస్తోంది. సోలో నాయికగానూ బిజీ. అందువల్ల కాల్షీట్లను సర్ధుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆల్టర్నేట్ ఆప్షన్ గా అటువైపు బాలీవుడ్ నాయికలకు నిర్మాత చరణ్ టచ్ లో ఉన్నారట. అవసరం మేర ఉత్తరాది భామల్ని దించే అవకాశం ఉందని చెబుతున్నారు. స్క్రిప్టుకు ఫైనల్ టచ్ ఇచ్చి లొకేషన్లను ఎంపిక చేసుకుని మార్చిలో సెట్స్ కి వెళ్లాలని కొరటాల సన్నాహకాల్లో ఉన్నారట.ఇక నేడు రిపబ్లిక్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద జండా వందనం చేస్తున్నారు. ఇక్కడికి భారీగా అభిమానులు విచ్చేసి ఇప్పటికే సందడి చేస్తున్నారు. తెలంగాణలో చిరు జండావందనం చేస్తుంటే అటు ఏపీలో పవన్ కల్యాణ్ జండా వందనం ఏర్పాట్లు చేసుకున్నారట. మెగా హీరోలు తొలి నుంచీ దేశభక్తిని చాటుతూనే ఉన్నారు. పవన్ తన సినిమాల్లో దేశభక్తిని ప్రధాన ఎజెండాగా ఎంచుకుని కొన్ని సీన్లు చూపించేవారన్న సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...