పెళ్లైన ఇన్నాళ్లకు అత్తారింట్లో అడుగు పెట్టిన శ్రియ

Star-Heroin-Shriya-Saran-in-In-Laws-House-Andhra-Talkies
Star-Heroin-Shriya-Saran-in-In-Laws-House-Andhra-Talkies
టాలీవుడ్ కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఇంకా కూడా స్టార్ హీరోలకు జోడీగా నటిస్తున్న ముద్దుగుమ్మ శ్రియ గత ఏడాది రష్యన్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లికి సంబంధించిన విషయాలను శ్రియ ఎప్పుడు కూడా రివీల్ చేయకుండా సీక్రెట్ గా ఉంచుతూ వచ్చింది. శ్రియ ప్రేమ మరియు పెళ్లి విషయాన్ని పలు సందర్బాల్లో ఆమె తల్లి కూడా కొట్టి పారేస్తూ వచ్చింది. పెళ్లి విషయం బయట పడితే ఆఫర్లు తగ్గుతాయనుకుందో లేక మరేంటో కాని పెళ్లి విషయాన్ని గుట్టుగా ఉంచింది. అయితే సోషల్ మీడియా ఇంతగా పెరిగిన తర్వాత ఏ విషయాన్ని గుట్టుగా ఉంచాలన్నా అయ్యే పని కాదు.

శ్రియ ఆండ్రుల వివాహం అయిన కొన్ని రోజులకే సోషల్ మీడియాలో వారి పెళ్లికి సంబంధించిన పిక్స్ లీక్ అయ్యాయి. దాంతో పెళ్లి విషయాన్ని శ్రియ ఆమె తల్లి ఒప్పుకోక తప్పలేదు. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూ వస్తున్న శ్రియ పెళ్లి అయినప్పటి నుండి కూడా రష్యాకు వెళ్లలేదట. శ్రియ మొన్నటి వరకు కూడా అత్తారింట్లో అడుగు పెట్టలేదట. ఎట్టకేలకు రష్యాకు వెళ్లడంతో పాటు ఆండ్రు కుటుంబ సభ్యులను కలిసి అత్తారింట్లో అడుగు పెట్టిందట.ఇండియాలో మరియు ఇతర వేడుకల్లో ఆండ్రు కుటుంబ సభ్యులతో కలిసిన శ్రియ అత్తారింటికి మాత్రం వెళ్లలేదని ఇన్నాళ్లకు ఆ ఘడియ వచ్చిందని శ్రియ సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఇప్పటి వరకు శ్రియ అక్కడకు వెళ్లక పోవడంకు ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు వెళ్లాల్సిన అవసరం రాలేదు కనుక వెళ్లలేదని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం శ్రియ రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా వెంకీ మామ చిత్రంలో కూడా వెంకటేష్కు జోడీగా ఎంపిక అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. నాలుగు పదుల వయసు రాబోతున్నా కూడా శ్రియ ఇంకా తన అందంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తూనే ఉంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...