అక్కినేని బయోపిక్ కు హీరో దొరికేశాడు

Sumanth-Performance-in-NTR-Kathanayakudu-Movie-Andhra Talkies
ఎన్టీఆర్ బయోపిక్ లో సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖుల్ని చూపించారు. ప్రతీ ఒక్కరూ తమకిచ్చిన పాత్రకు న్యాయం చేశారు. అయితే.. ఈ బయోపిక్ లో అందరికంటే ఎక్కువగా - ఇంకా చెప్పాలంటే పర్ ఫెక్ట్ గా సూట్ అయ్యింది ఒక్క అక్కినేని పాత్ర పోషించిన సుమంతే.

నాగిరెడ్డి - చక్రపాణి - బీఏ సుబ్బారావు.. ఇలాంటి ప్రముఖులంతా మనకు ఎలా ఉంటారో తెలుసు తప్ప ఎలా మాట్లాడతారు - బాడీ లాంగ్వేజ్ లాంటివి మనకు తెలియదు. అదే అక్కినేని గురించి అయితే అందరికి తెలుసు. అక్కినేని మాట్లాడే తీరు - ఆయన నడిచే విధానం - చూసే చూపు ఇలా ప్రతీది అందరికి తెలుసు. వాటన్నింటిని అద్భుతంగా తన పాత్రలో పలికించాడు సుమంత్. ఇన్నాళ్లు అక్కినేని పాత్ర కోసం సరైన నటుడు లేక నాగార్జున బయోపిక్ స్టార్ట్ చేయలేదు.


ఇప్పుడు ఆయనకు ఆ బెంగ అవసరం లేదు. నటుడు ఆయన ఇంట్లోనే ఉన్నాడు. పర్ ఫెక్ట్ గా స్క్రిప్ట్ రాసుకుని సుమంత్ ని హీరోగా పెట్టి ఏఎన్నార్ బయోపిక్ మొదలుపెట్టేయచ్చు. అయితే సినిమాలో ఒక సిన్ ఉంటుంది. ఎన్టీఆర్ - ఏఎన్నార్ ఇద్దరు సిగరెట్స్ ముట్టించుకుని ఒకరి భుజంపై ఒకరు చేయి వేసుకుని నిలబడతారు. ఒరిజినల్ గా అక్కినేని కంటే ఎన్టీఆర్ హైట్. కానీ బయోపిక్ కు వచ్చేసరికి.. హైట్ కాస్తా రివర్స్ అయ్యింది. ఇక్కడ బాలయ్య కంటే సుమంత్ హైట్ మరి. అదొక్కటే తేడా అంతే.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...