టాప్ స్టోరి: పాక్ సినిమాకి ఉరి శిక్ష!

Bollywood-Movies-Effect-on-Pakistan-Andhra-Talkies
Bollywood-Movies-Effect-on-Pakistan-Andhra-Talkies
తెలివైన దాయాది ఎప్పుడూ తెలివితక్కువ పని చేయకూడదు. ఈగోలకు.. పంతానికి పోతే ఆ నష్టం దారుణంగానే ఉంటుంది. ప్రస్తుతం పాక్ సన్నివేశం అలానే ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ సినిమా ఒకే ఒక్క దెబ్బకు కుదేలైపోయింది. పుల్వామా దాడి అనంతరం తీవ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు.. ఏరివేత వల్ల ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు దెబ్బ తిన్నాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇది కేవలం సరిహద్దుల వరకే పరిమితం కాదు. అన్ని రంగాలపైనా తీవ్రంగా పడుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ సినిమాని భారత్ నిషేధించింది. ఇక్కడ థియేటర్లలో పాక్ సినిమా రిలీజ్ చేయడానికి అనుమతిని నిరాకరించింది. దీంతో పాకిస్తాన్ సినీఇండస్ట్రీకి చావు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ సినిమాలకు బాలీవుడ్ వల్ల రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. తాజా నిషేధంతో అంతా పోయినట్టే. ఇప్పట్లో పాక్ సినీపరిశ్రమ కోలుకోవడం అంత సులువేం కాదు.

లైంగిక వేదింపులతో నటనకు గుడ్ బై

Kerala-Actress-Kani-Kasruti-Sensational-Comments-on-Casting-Couch-Andhra-Talkies
ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా అన్ని భాషల సినీ ఇండస్ట్రీస్ లో కూడా లైంగిక వేదింపులు ఉన్నాయని మీటూ ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత వెళ్లడయ్యింది. చాలా మంది బయటకు మాట్లాడలేక పోయినా లోలోపల మీటూ ఉద్యమం వల్ల మంచి జరుగుతుందని ఆశిస్తున్నారు. మరో వైపు మీటు ఉద్యమం గతి తప్పిందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మలయాళ నటి కాని కుస్రుతి లైంగిక వేదింపుల కారణంగా నటనకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటించింది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుండి కూడా ఎన్నో సార్లు ఎంతో మంది చేతిలో లైంగిక వేదింపులకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసిన కాని కుస్రుతి నటనకు స్వస్థి చెప్పి మీటూ ఉద్యమంలో పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు సిద్దం అయ్యింది. మలయాళంలో మూడు నాలుగు సినిమాలతో మంచి గుర్తింపును దక్కించుకోవడంతో పాటు తమిళంలో ఒక షార్ట్ ఫిల్మ్ తో తమిళ ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు దక్కించుకుంది.

పుకార్లకు చెక్ పెట్టేసిన టాలీవుడ్ గూఢచారి

Tollywood-Actor-Adivi-Sesh-rubbishes-wedding-reports-Andhra-Talkies
ఈ పాడులోకం బ్యాచిలర్లను ప్రశాంతంగా బతకనివ్వదు కదా.  పెళ్ళెప్పుడు.. ఎప్పుడు.. ఎప్పుడు? పెళ్ళి ఎవరితో.. ఎవరితో.. ఎవరితో? ఇలా వేధిస్తారు.   ఒకవేళ సదరు హీరో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుందామంటే ఎవరో ఒక చక్కని చుక్కను అంటగట్టి 'విషయం ఉందటగా.. పెళ్ళెప్పుడు?' అని మళ్ళీ మొదటికే వస్తారు.  బాహుబలి.. భల్లలదేవులకే ఈ పీడ తప్పడం లేదు.. అలాంటిది టాలీవుడ్ గూఢచారిని ఎలా వదులుతారు?

అదే పనిగా గూఢచారి అడివి శేష్ పెళ్ళి గురించి తెగ రూమర్లు హల్చల్ చేస్తుండడంతో ఇక చేసేది లేక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన లవ్వు ఏంటో చెప్పేశాడు.. "గయ్స్ అండ్ గర్ల్స్.. నా జీవితంలో పెద్ద విషయం ఏదైనా ఉందంటే అది సినిమాలు. యాక్టింగ్. రైటింగ్.  నాకిష్టమైన వాటిని చేస్తూ నా కలలను సాకారం చేసుకుంటున్నాను. వినమ్రంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. కష్టపడుతున్నాను. నన్ను నేను మెరుగుపరుచుకుంటున్నాను.  నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇంకేం లేదు." ఈ పిక్చర్ మెసేజికి శేష్ గారు ఇచ్చిన క్యాప్షన్ #ట్రూత్.

రియల్ పాలిటిక్స్ కు నో.. రీల్ పాలిటిక్స్ కు యస్! - సూపర్ స్టార్ మహేష్ బాబు

No-For-Real-Politics-And-Yes-For-Reel-Politics-Maheshbabu-Andhra-Talkies
పెద్ద పెద్ద స్టార్ హీరోలకు రెగ్యులర్ గా ఎదురయ్యే ప్రశ్నల్లో ఒకటి.. "మీకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉందా.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉందా?"   ఒకవేళ ఈ ప్రశ్నకు సమాధానం 'నో' అని ఆ స్టార్ హీరో  చెప్తే.. "ఇప్పుడున్న పార్టీల్లో ఏ పార్టీకి మద్ధతిస్తారు?" అంటూ మరో ప్రశ్న అడుగుతారు.  ఈ ప్రశ్నలు సూపర్ స్టార్ మహేష్ బాబును అడిగిన ప్రతి సారీ తన ఫోకస్ సినిమాలపైనేనని క్లారిటీ ఇచ్చాడు.

రీసెంట్ గా మహేష్ సతీమణి నమ్రతను ఇదే విషయంపై ప్రశ్నిస్తే "మహేష్ ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని.. ఫలానా అభ్యర్థిని సమర్థించడం లాంటిది కూడా చేయడం లేదని" క్లారిటీ ఇచ్చారు. నిజ జీవితంలో రాజకీయాలకు ఆమడ దూరం ఉండే టాలీవుడ్ సూపర్ స్టార్ సినిమాల విషయం వచ్చేసరికి రాజకీయ నాయకుడిగా కనిపించేందుకు ఏమాత్రం వెనుకాడడు.  'దూకుడు' లో డూప్ ఎంఎల్ ఎ పాత్ర కానివ్వండి.. 'భరత్ అనే నేను' సినిమాలో నిజం సీఎమ్ పాత్ర కానివ్వండి.. దేనికైనా సైసై అంటాడు.

అమర జవానుల కుటుంబాలకు అమితాబ్ సాయం

Amitabh-Bachchan-to-donate-5-lakh-rupees-to-the-families-of-CRPF-Andhra-Talkies
Amitabh-Bachchan-to-donate-5-lakh-rupees-to-the-families-of-CRPF
జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జైష్ ఏ మొహమ్మద్ సంస్థ తీవ్రవాద దాడిలో 49 మంది సీఆర్పీఎఫ్ జవానులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడిని దేశం యావత్తూ ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఫిలిం ఇండస్ట్రీ సెలబ్రిటీలు చాలామంది ఇప్పటికే ఈ దాడిపై తమ స్పందనను తెలిపారు.  బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్.. అక్షయ్ కుమార్ తదితరులు ఇప్పటికే తమ ట్విట్టర్ ఖాతా ద్వారాఈ దాడిని ఖండించారు.

ఇదిలా ఉంటే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక అడుగు ముందుకు వేసి అమరులైన జవానుల కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించారు.  దాడిజరిగిన ప్రదేశంలో 40 మంది జవానులు  ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన ఇతర జవానులను  వైద్యం కోసం ఆసుపత్రికి తరలించగా శుక్రవారం సాయంత్రానికి మృతుల సంఖ్య మొత్తం 49 కి చేరింది. ఈ 49 మంది జవానుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' వెనక ఎవరా షాడో?

Lakshmis-NTR-Producer-Rakesh-Reddy--Travel-With-YS-Jagan-Andhra-Talkies
Lakshmis-NTR-Producer-Rakesh-Reddy--Travel-With-YS-Jagan-Andhra-Talkies
ఆర్జీవీ `లక్ష్మీస్ ఎన్టీఆర్` ట్రైలర్ సెన్సేషన్స్ గురించి తెలిసిందే. లక్ష్మీ పార్వతి కోణంలో ఎన్టీఆర్ కథను తెరపై ఆవిష్కరిస్తున్నానని ఆర్జీవీ ఇదివరకూ ప్రకటించారు. అసలైన ఎన్టీఆర్ జీవిత కథ ఇదే అంటూ తాను చెప్పిందే చేసి చూపిస్తున్నాడు. ఇది కుటుంబ కుట్రల కథ అంటూ పోస్టర్లపైనే ముద్రించిన వర్మ తన మొండి పట్టుదల ఎలాంటిదో ట్రైలర్ తోనే చూపించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ యూట్యూబ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. సాధారణ జనంలో ఎంతో ఆసక్తి పెంచింది ఈ ట్రైలర్.

సరిగ్గా ఏపీ ఎన్నికల ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకంపనాలు ఎటు దారి తీస్తాయోనన్న ఆందోళన తేదేపా వర్గాల్లోనూ మొదలైంది. ఒక రియల్ స్టోరీని అంతే ఒరిజినాలిటీతో చూపిస్తున్న ఆర్జీవీ ఈ సినిమా ప్రమోషన్స్ కి రాజకీయాల్ని... అవతలివారిని తెలివిగా ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. టైమ్ చూసి టైమింగ్ తో ఇరకాటంలో పెట్టేస్తూ..  పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా అప్పుడప్పుడు ఫన్ తో కూడుకున్న ఛమక్కులతోనూ తన సినిమాకి  ప్రచారం చేసుకుంటున్నాడు ఆర్జీవీ. తాజాగా ఓ ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఆర్జీవీ దానికి ఆసక్తికరమైన కామెంట్లను పోస్ట్ చేశారు.

'గీతా ఆర్ట్స్ 2' లోగుట్టు తెలిసిందిలా

Success-Secret-Behind-Geetha-Arts-2-Banner-Andhra-Talkies
సక్సెస్ లేనిదే ఏదీ లేదు. రంగుల ప్రపంచంలో అది చాలా ఇంపార్టెంట్. కోట్లాది రూపాయల సొమ్ముల్ని మంచి నీళ్లలా వెదజల్లి సినిమా తీశాక సొమ్ము తిరిగి వెనక్కి రాకపోతే ఎలా?  బోలెడంత డబ్బు తో పాటు సమయం వృధా అవ్వడమే గాక అప్పుల  పాలవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ పరిశ్రమలో సాహసం చేసేవాళ్లంతా గట్స్ ఉన్న వాళ్ల కిందే లెక్క. అయితే సాహసం చేయడమే కాదు.. సినిమాతో సావాసం చేయడంలో ప్రీప్రొడక్షన్ దశలోనే సక్సెస్ లాజిక్ అంతా బుర్రకు ఎక్కించుకుని పని చేస్తేనే విజయం సాధ్యమవుతుంది. సక్సెస్ ఫార్ములాని కనుక్కోవాలని బుర్రలు బాదుకునే వాళ్లందరికీ ఆ రహస్యం అంత తేలిగ్గా అంతు చిక్కదు. దీనిపై ఎంతో మదన పడుతుంటారు. అలాంటి వారందరికీ ఓ దారి చూపిస్తోంది గీతా ఆర్ట్స్ సంస్థ. ముఖ్యంగా గీతా ఆర్ట్స్ అనుబంధ బ్యానర్ జీఏ2 సక్సెస్ వెనక బోలెడంత స్ట్రాటజీ ఉందని తెలుస్తోంది. ఆ ఒక్కటీ తెలుసుకుంటే నవతరం దర్శకనిర్మాతలకు అది కలిసొస్తుందనడంలో సందేహమే లేదు. 100 పర్సంట్ లవ్ - గీత గోవిందం వంటి సంచలన విజయాల్ని ఖాతాలో వేసుకున్న జీఏ2 సక్సెస్ సీక్రెట్ ఏమిటి? అని ఆరాతీస్తే తెలిసిన సంగతి ఇదీ..

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...