లైంగిక వేదింపులతో నటనకు గుడ్ బై

Kerala-Actress-Kani-Kasruti-Sensational-Comments-on-Casting-Couch-Andhra-Talkies
ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా అన్ని భాషల సినీ ఇండస్ట్రీస్ లో కూడా లైంగిక వేదింపులు ఉన్నాయని మీటూ ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత వెళ్లడయ్యింది. చాలా మంది బయటకు మాట్లాడలేక పోయినా లోలోపల మీటూ ఉద్యమం వల్ల మంచి జరుగుతుందని ఆశిస్తున్నారు. మరో వైపు మీటు ఉద్యమం గతి తప్పిందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మలయాళ నటి కాని కుస్రుతి లైంగిక వేదింపుల కారణంగా నటనకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటించింది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుండి కూడా ఎన్నో సార్లు ఎంతో మంది చేతిలో లైంగిక వేదింపులకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసిన కాని కుస్రుతి నటనకు స్వస్థి చెప్పి మీటూ ఉద్యమంలో పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు సిద్దం అయ్యింది. మలయాళంలో మూడు నాలుగు సినిమాలతో మంచి గుర్తింపును దక్కించుకోవడంతో పాటు తమిళంలో ఒక షార్ట్ ఫిల్మ్ తో తమిళ ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు దక్కించుకుంది.స్టేజ్ ఆర్టిస్టుగా కెరీర్ ను ఆరంభించిన కాని కుస్రుతి అక్కడ నుండి వెండి తెరకు పరిచయం అయ్యింది. వెండి తెరపై విభిన్నమైన పాత్రలు పోషించిన ఈమెకు లైంగిక వేదింపులు ప్రతి చోట స్వాగతం పలికాయట. దాంతో నటనకు స్వస్థి చెప్పాలని నిర్ణయించుకుంది. ఇలా ఎంతో మంది లైంగిక వేదింపుల వల్ల ఇండస్ట్రీని వదిలి పెట్టారు. అయితే ఈమె మాత్రం నటనకు గుడ్ బై చెప్పినా కూడా ఇండస్ట్రీలో ఉన్న ఈ లైంగిక వేదింపులను పారద్రోలేందుకు ఉద్యమం చేయాలని నిర్ణయించుకుంది. కానితో పాటు ఇంకా చాలా మంది నటీమణులు కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకునేందుకు ముందుకు వస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...