'లక్ష్మీస్ ఎన్టీఆర్' వెనక ఎవరా షాడో?

Lakshmis-NTR-Producer-Rakesh-Reddy--Travel-With-YS-Jagan-Andhra-Talkies
Lakshmis-NTR-Producer-Rakesh-Reddy--Travel-With-YS-Jagan-Andhra-Talkies
ఆర్జీవీ `లక్ష్మీస్ ఎన్టీఆర్` ట్రైలర్ సెన్సేషన్స్ గురించి తెలిసిందే. లక్ష్మీ పార్వతి కోణంలో ఎన్టీఆర్ కథను తెరపై ఆవిష్కరిస్తున్నానని ఆర్జీవీ ఇదివరకూ ప్రకటించారు. అసలైన ఎన్టీఆర్ జీవిత కథ ఇదే అంటూ తాను చెప్పిందే చేసి చూపిస్తున్నాడు. ఇది కుటుంబ కుట్రల కథ అంటూ పోస్టర్లపైనే ముద్రించిన వర్మ తన మొండి పట్టుదల ఎలాంటిదో ట్రైలర్ తోనే చూపించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ యూట్యూబ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. సాధారణ జనంలో ఎంతో ఆసక్తి పెంచింది ఈ ట్రైలర్.

సరిగ్గా ఏపీ ఎన్నికల ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకంపనాలు ఎటు దారి తీస్తాయోనన్న ఆందోళన తేదేపా వర్గాల్లోనూ మొదలైంది. ఒక రియల్ స్టోరీని అంతే ఒరిజినాలిటీతో చూపిస్తున్న ఆర్జీవీ ఈ సినిమా ప్రమోషన్స్ కి రాజకీయాల్ని... అవతలివారిని తెలివిగా ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. టైమ్ చూసి టైమింగ్ తో ఇరకాటంలో పెట్టేస్తూ..  పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా అప్పుడప్పుడు ఫన్ తో కూడుకున్న ఛమక్కులతోనూ తన సినిమాకి  ప్రచారం చేసుకుంటున్నాడు ఆర్జీవీ. తాజాగా ఓ ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఆర్జీవీ దానికి ఆసక్తికరమైన కామెంట్లను పోస్ట్ చేశారు.``ఈ ఫోటోలో లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డి ఉన్నారు. నవ్వుతున్న వ్యక్తి ఆయనే. ఆ పక్కనే మధ్యలో అతడి స్నేహితుడు ఉన్నారు. కానీ ఆ చివరిలో కుడివైపుగా ఉన్నది ఎవరో నాకు తెలీనే తెలీదు`` అంటూ ఆర్జీవీ ఫన్ క్రియేట్ చేశారు. ఆ కార్నర్ లో ఉన్నది వైసీపీ అధినేత వైయస్ జగన్ అన్న సంగతి అందరికీ తెలుసు. ఈ ఫోటో లీక్స్ తో ఆర్జీవీ అనవసరమైన సందేహాల్ని రాజేసారు. `లక్ష్మీస్ ఎన్టీఆర్` తెర వెనక ఉన్నది వైయస్ జగన్ అయ్యి ఉండొచ్చేమో! అన్న సందేహం కలిగేలా ఈ ఫోటోని షేర్ చేయడం వెనక లాజిక్ ఏంటో?  ఫన్ కోసమేనా?  లేక దీనిని పబ్లిసిటీ కోసమే వాడేస్తున్నాడా? అన్నది తేలాల్సి ఉంది. ఆ అపరిచితుడు ఎవరో మాకు తెలుసు. ఆయన్ని `యాత్ర` సినిమాలో చూశాం.. అంటూ నెటిజనులు ఎంతో ఫన్నీగా వర్మకు సామాజిక మాధ్యమాల్లో ఆన్సర్ చేస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...