పుకార్లకు చెక్ పెట్టేసిన టాలీవుడ్ గూఢచారి

Tollywood-Actor-Adivi-Sesh-rubbishes-wedding-reports-Andhra-Talkies
ఈ పాడులోకం బ్యాచిలర్లను ప్రశాంతంగా బతకనివ్వదు కదా.  పెళ్ళెప్పుడు.. ఎప్పుడు.. ఎప్పుడు? పెళ్ళి ఎవరితో.. ఎవరితో.. ఎవరితో? ఇలా వేధిస్తారు.   ఒకవేళ సదరు హీరో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుందామంటే ఎవరో ఒక చక్కని చుక్కను అంటగట్టి 'విషయం ఉందటగా.. పెళ్ళెప్పుడు?' అని మళ్ళీ మొదటికే వస్తారు.  బాహుబలి.. భల్లలదేవులకే ఈ పీడ తప్పడం లేదు.. అలాంటిది టాలీవుడ్ గూఢచారిని ఎలా వదులుతారు?

అదే పనిగా గూఢచారి అడివి శేష్ పెళ్ళి గురించి తెగ రూమర్లు హల్చల్ చేస్తుండడంతో ఇక చేసేది లేక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన లవ్వు ఏంటో చెప్పేశాడు.. "గయ్స్ అండ్ గర్ల్స్.. నా జీవితంలో పెద్ద విషయం ఏదైనా ఉందంటే అది సినిమాలు. యాక్టింగ్. రైటింగ్.  నాకిష్టమైన వాటిని చేస్తూ నా కలలను సాకారం చేసుకుంటున్నాను. వినమ్రంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. కష్టపడుతున్నాను. నన్ను నేను మెరుగుపరుచుకుంటున్నాను.  నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇంకేం లేదు." ఈ పిక్చర్ మెసేజికి శేష్ గారు ఇచ్చిన క్యాప్షన్ #ట్రూత్.అయినా పైన ఉన్న సందేశంలో 'పెళ్ళి'.. 'పిల్ల' అనే మాటలు రాలేదుగా అని మీరు దయచేసి చచ్చు పుచ్చు అనుమానాలు వ్యక్తం చేయకండి. గూఢచారి కదా.. అయన సందేశంలో అర్థాలన్నీ కాస్త నిగూఢమైనవి గానే ఉంటాయి. అర్థం చేసుకోరూ..!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...