షాకింగ్ ట్విస్టు: ఎమీజాక్సన్ ఫ్రెగ్నెన్సీ!

Sexy-Heroin-Amy-Jackson-Shocks-Her-Fans-Andhra-Talkies
బ్రిటీష్ టాప్ మోడల్ .. అందాల కథానాయిక ఎమీజాక్సన్ తల్లి కాబోతోందా? అంటే అవుననే అధికారిక సమాచారం. ఆ మేరకు తాను గర్భిణి అన్న విషయాన్ని ఎమీజాక్సన్ నేడు ప్రకటించి పెద్ద షాకిచ్చింది. వాస్తవానికి నేడు బ్రిటన్ లో మదర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి వేళ టైమ్ చూసి ఆ టాప్ సీక్రెట్ ని ఎమీ జాక్సన్ రివీల్ చేయడం అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఎమీ గత కొంతకాలంగా ఎందుకనో సైలెంట్ గా ఉంటోంది. 2.0 తర్వాత వేరొక సినిమాకి సంతకమైనా చేయలేదు! అంటూ మీడియా ఇటీవల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఎమీ నిరంతరం గ్యాప్ లేకుండా లండన్ ప్రియుడు జార్జి పనాయట్టుతో కలిసి దేశ విదేశాల్లోని ఒంటరి దీవులకు షికార్లు చేస్తుండడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు ఆ అనుమానాలే నిజమై.. ఇప్పుడు రిజల్ట్ కూడా వచ్చేసింది. ఎమీజాక్సన్ ఫ్రెగ్నెంట్. సాధ్యమైనంత తొందర్లోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. అందుకు సంబంధించిన బేబి బంప్ ఫోటోల్ని ఎమీజాక్సన్ స్వయంగా అంతర్జాలంలో రివీల్ చేయడం  బిగ్ షాక్ కి కారణమైంది.

పెళ్లి వార్తలపై కస్సుబుస్సులాడిన హీరోయిన్

Heroin-Anjali-Responds-On-Her-Marriage-Andhra-Talkies
తెలుగు హీరోయిన్ అంజలి టాలీవుడ్ లో 'గీతాంజలి'.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి హిట్ సినిమాలలో నటించినా ఎందుకో  స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.  తెలుగు కంటే కంటే తమిళంలో ఎక్కువ గుర్తింపు సాధించింది.  తాజాగా అంజలిపై కోలీవుడ్ మీడియాలో పెళ్లి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తీవ్రంగా స్పందించింది.

మీడియాలో అంజలి పెళ్లి వార్తలు రావడం కొత్తేమీ కాదు. కొంతకాలం క్రితం తమిళ హీరో జై తో లవ్ ఎఫైర్.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని ఇక నెక్స్ట్ పెళ్లి అనుకునే సమయంలో  బ్రేకప్ కావడం అందరికీ తెలిసిన విషయాలే.   కానీ ఈసారి పెళ్లివార్తలు అలా రాలేదు. వరుడు ఎవరో తెలియదు కానీ త్వరలో అంజలి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందని.. సినిమాలకు కూడా గుడ్ బై చెప్తుందని కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపించాయి. దీనిపై స్పందించిన అంజలి అసలు "నేను సినిమాలకు గుడ్ బై చెప్తున్నానని ఎవరు చెప్పారు?" అంటూ ప్రశ్నించింది.

క్రిష్ ను ఇంకా వదలని కంగనా..!

krish-kangana-Andhra-talkies
దర్శకుడు క్రిష్ మీద కంగనాకి పీకలదాకా కోపమన్న సంగతి మనందరికీ తెలిసిందే! ఆ కోపం ఎందుకు వస్తుందో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. కంగనాతో వేగలేక క్రిష్ "మణికర్ణిక" నుంచి తప్పుకున్నా క్రిష్ మీద కంగనా విసుర్లు ఆగడం లేదు. నిన్న మొన్నటి దాకా తన సినిమాను చెత్తగా తీశాడని అందుకే రీషూట్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు "కధానాయకుడు",మహానాయకుడు" మీద పడింది. ఈ రెండు సినిమాలు ప్లాఫ్ కావడానికి క్రిష్ కారణమని ఆ రెండు సినిమాలు పరమ చెత్తగా తీశాడని అంటోంది. ఈ సినిమాల పరాజయంలో బాలకృష్ణ ప్రమేయం ఏమీ లేదని, ఆయన చాలా బాగా చేసినా, దర్శకుడు ప్రతిభావంతుడు కాకపోవడంతో ఫలితం తిరగబడిందని చెప్పుకొచ్చింది. కంగనా వరస చూస్తుంటే క్రిష్ ని ఇప్పుడప్పుడే వదిలేలా లేదని సినీ జనాలు అంటున్నారు. హృతిక్ లాంటి హీరోనే కంగనా దెబ్బకు కామ్ అయ్యిపోవాల్సి వచ్చిందనీ, ఇంక క్రిష్ గురించి చెప్పుకోనక్కరలేదనీ అంటున్నారు. ఇంతకీ వీరిద్దరి గొడవకు అసలు కారణాలేమిటో..?

ఆయనకు ఇలా మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడడం కొత్త కాదు. ఇదేమీ మొదటిసారి కాదు - హీరో విశాల్

Hero-Vishal-Responds-on-Radha-Ravi-And-nayanthara-Issue-Andhra-Talkies
స్టార్ హీరోయిన్ నయనతారపై సీనియర్ తమిళ నటుడు రాధారవి అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదం రోజురోజుకీ పెద్దదవుతోంది.  ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు రాధారవి వ్యాఖ్యలను ఖండించారు.  డీఎంకే పార్టీ నుండి రాధారవిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు.

బాలీవుడ్ నటి 'షకీలా' చిత్రంలో నటిస్తున్న రిచా చద్దా ఈ విషయంపై స్పందిస్తూ డీఎంకే పార్టీ నిర్ణయాన్ని ప్రశంసించారు. "మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారెవరినీ క్షమించకూడదు. అసభ్యకరమైన ప్రవర్తనకు.. కించపరిచే మాటలకు ఆధునిక సమాజంలో చోటు లేదు"అంటూ గట్టిగా తన అభిప్రాయాన్ని వినిపించింది.  ఖుష్బూ మాట్లాడుతూ "రాధా రవి వ్యాఖ్యలు దారుణమైనవి. అతని కామెంట్స్ తో నేను షాక్ అయ్యాను. మగవాళ్ళకు మాట్లాడటం చేతకానప్పుడు ఇలా మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే పనికి తెగబడతారు" అంటూ విమర్శించింది.

సీసీ టీవీ ఫుటేజ్ సాక్ష్యాలను భయట పెట్టిన శ్రీరెడ్డి

Sri-Reddy-Releases-Video-Footage-Of-Financier-Subramaniam-Andhra-Talkies
గత కొన్నాళ్లుగా చెన్నైలో ఉంటున్న శ్రీరెడ్డి తనపై హత్య ప్రయత్నం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన విషయం తెల్సిందే. పోలీసులు కేసు నమోదు చేయకుండా సుబ్రమణ్యం అనే వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ శ్రీరెడ్డి ఆరోపిస్తుంది. అర్థరాత్రి మూడు గంటల సమయంలో నేను పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేదని కనీసం కేసును రిజిస్ట్రర్ కూడా చేయలేదని ఆమె వాపోయింది. పైగా కేసు క్యాన్సిల్ చేసుకుని నేను రాజీకి వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు అంటూ శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాను రాజీ చేసుకోలేదని సుబ్రమణ్యం అనే వ్యక్తి నన్ను చంపేందుకు మనుషులతో వచ్చాడు ఆ సమయంలో నేను బెడ్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాను. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు వచ్చి నన్ను కాపాడారు అంటూ శ్రీరెడ్డి చెప్పారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఇదుగో అంటూ శ్రీరెడ్డి తన ఇంటికి సంబంధించిన కొన్ని సీసీ టీవీ ఫుటేజ్ లను విడుదల చేసింది. ఫైనాన్సియర్ అయిన సుబ్రమణ్యం హైదరాబాద్ లో కేసుల కారణంగా నాలుగు నెలల పాటు జైల్లో ఉన్నాడు. జైలు నుండి విడుదలైన వెంటనే ఇక్కడకు వచ్చాడు.

ట్వీట్ చేసి మళ్ళి దొరికిపోయిన ఆంటీ

Kasthuri-IPL-tweet-gets-trolled-Andhra-Talkies
ఏదో ఒక వివాదం లేనిదే వార్తల్లో ఉండలేమని గుర్తించిన మాజీ హీరోయిన్ కస్తూరి దీనికి సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంది. ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ ఇష్యూ లో తలదూర్చి సంచలనం రేపే ప్రయత్నం గట్టిగానే చేసింది కాని అవి పెద్దగా ఫలించలేదు. ఇటీవల ఓ ఆడియో వేడుకలో హీరో కార్తి ముందే ఆయన తండ్రి శివకుమార్ సెల్ఫీ గొడవ గురించి వ్యంగ్యంగా కామెడీ చేయబోయే అపహాస్యం పాలైన సంగతి తెలిసిందే.

భారతీయుడు-అన్నమయ్య లాంటి సినిమాల ద్వారా మనకూ పరిచయమున్న ఈ కస్తూరి కన్ను ఇప్పుడు ఐపిఎల్ మీద పడింది. దేశంలో చాలా సమస్యల కీలకమైన ఎన్నికలు ముంగిట ఉండగా ఇలా కృత్రిమ వినోదమైన క్రికెట్ కోసం ఎగబడటం ఏమిటని అర్థం వచ్చేలా తమిళ్ లో చాంతాడంత ట్వీట్ పెట్టింది

నా ఆస్తులమ్మి మీ పార్టీకిస్తా.. విష్ణు చాలెంజ్

Manchu-Vishnu-Challenges-Andhra-Govt-Andhra-Talkies
తన విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిల కోసం నటుడు మోహన్ బాబు రోడ్డెక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది. వైసీపీకి మద్దతుగానే మోహన్ బాబు రాజకీయం చేస్తున్నాడని టీడీపీ నేతలు ఆడిపోసుకుంటున్నారు. ఈ వివాదంలోకి మోహన్ బాబు కుమారులు కూడా ఎంటర్ అయ్యారు.

తాజాగా మోహన్ బాబు తన విద్యాసంస్థలకు రావాల్సిన బకాయిలపై తప్పుడు లెక్కలు చూపిస్తున్నారనే విమర్శలపై మంచు విష్ణు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రావడం లేదని.. ప్రభుత్వం నుంచి మేము లేఖలో పేర్కొన్న దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా.. నా ఆస్తులన్నీ అమ్మేసీ మీ పార్టీ కు ఇస్తానని మంచు విష్ణు టీడీపీ నేతలకు ఓపెన్ చాలెంజ్ చేశాడు.

నటించడం.. ఆపేయడం నా ఇష్టం!

Radhika-Pandit-On-Compromising-Career-After-Marrying-Yash-Andhra-Talkies
గత జెనరేషన్ వారితో పోలిస్తే ఈ సోషల్ మీడియా జెనరేషన్ వారికి ఫ్రీడమ్ చాలా ఎక్కువ ఉంది.  కానీ దీనికి నెగెటివ్ ఎఫెక్ట్ అన్నట్టుగా ప్రతి ఒక్క విషయంపై మన అమూల్య అభిప్రాయాలు పడేయడం కూడా కామన్ అయిపోయింది. నిజానికి ఎవరి పనులు వారు చేసుకోకుండా  హీరోలు ఎలా ఉండాలి..  వరదలు వస్తేఎంత డొనేషన్ ఇవ్వాలి.. హీరోయిన్లు ఎలా ఉండాలి.. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి ఇలా అన్ని నిర్ణయాలు నెటిజనులే చెప్పేస్తున్నారు.  అయినదానికీ కానిదానికి సెలబ్రిటీలను ట్రోల్ చేయడం కూడా చాలా సాధారణం అయిపోయింది.  ఇలానే రీసెంట్ గా 'కేజీఎఫ్' స్టార్ యష్ సతీమణి రాధిక పండిట్ కు నెటిజనుల నుండి హీట్ తగిలింది.

పద్మశ్రీ అందుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి

Sirivennela-Seetharama-Sastry-honoured-by-President-Ram-Nath-Kovind-Andhra-Talkies
ఎన్నో తెలుగు సినిమాకు తన కలంతో ప్రాణం పోసి తెలుగు లెజెండ్రీ రచయితగా పేరు దక్కించుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి కేంద్ర ప్రభుత్వం మొన్న గణతంత్ర దినోత్సవం సందర్బంగా పద్మశ్రీ అవార్డును ప్రకటించిన విషయం తెల్సిందే. దేశంలోనే నాల్గవ అత్యున్నత అవార్డు అయిన పద్మశ్రీ అవార్డు తెలుగు సినిమా రచయితకు రావడంతో తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం హర్షం వ్యక్తం చేసింది. నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా శాస్త్రిగారు ఆ అవార్డును అందుకున్నారు.

నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రముఖుల సమక్షంలో - కుటుంబ సభ్యుల సమక్షంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన శాస్త్రిగారికి పద్మ అవార్డు రావడం తెలుగు సినిమా పరిశ్రమకు సంతోషకర విషయం అంటూ సినీ ప్రముఖులు ఈ సందర్బంగా స్పందించారు.

ఏప్రిల్ లో పెళ్లి.. బాలీవుడ్ కి పార్టీ!

Sexy-Heroin-Malaika-Arora-And-Arjun-Kapoor-To-Get-Married-In-April-2019-Andhra-Talkies
మలైకా ఆరోరాఖాన్ - అర్జున్ కపూర్ ప్రేమాయణం - పెళ్లి గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ భామ లేటు వయసు ఘాటు ప్రేమపై ఇప్పటికే బాలీవుడ్ మీడియా వేడెక్కించే కథనాలను వండి వారుస్తోంది. సదరు యువహీరోతో మలైకా షికార్లు వెంబడించి మరీ హైలైట్ చేస్తూ బాలీవుడ్ మీడియా చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రఖ్యాత క్వింట్ ఈ జోడీ ఏప్రిల్ లో పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారని ఓ ఆసక్తికర కథనం ప్రచురించింది. తాజాగా మరో అప్ డేట్ అందింది. ఈ జోడీ వివాహం పూర్తి ప్రయివేట్ ఎఫైర్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వివాహానంతరం బాలీవుడ్ ప్రముఖులకు ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారట. ఈ వేడుకకు మలైకా - అర్జున్ ఇరు కుటుంబాలకు అత్యంత  సన్నిహితులు - హితులు ఎటెండ్ అవుతారని తెలుస్తోంది.

అనుష్క 14 ఏళ్ల క్రితం జ్ఞాపకాలు

Heroin-Anushka-Says-Thanks-to-Nagarjuna-and-Puri-Jagannath-Andhra-Talkies
టాలీవుడ్ లో దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. కొద్ది మందికి మాత్రమే దక్కిన ఆ గౌరవం అనుష్క కూడా పొందింది. అనుష్క గత సంవత్సర కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా కూడా ప్రేక్షకులు ఆమె సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. 'బాహుబలి' చిత్రంతో బాలీవుడ్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న అనుష్క ప్రస్తుతం 'సైలెన్స్' అనే చిత్రంలో నటించేందుకు సిద్దం అవుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రంతో అనుష్క చిన్న గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక అనుష్క సినీ ఎంట్రీ ఇచ్చి 14 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది.

రంగీలాకు రాము 'హ్యపీ ఉమన్స్ డే'..!

Director-Ram-Gopal-Varma-Womens-Day-Wishes-to-Urmila-Andhra-Talkies
ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు.  ఈ సందర్భాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన సినిమాకు ఆయుధం గా వాడుకున్నాడు. మార్చ్ 6 బుధవారం నాడు ఆయన ఇలా ట్వీట్ చేశాడు "లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది ఫస్ట్ ఉమన్ ఓరియెంటెడ్ మెన్స్ ఫిలిం.  హ్యాపీ ఉమెన్స్ డే."  అది రెండ్రోజుల క్రితం.  ఈరోజు 'ఉమెన్స్ డే' సందర్భంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రెండో ట్రైలర్ రిలీజ్ చేశారు.

 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ 2.. హంగామా అంతా ప్రొఫెషన్ కోసం ఉమెన్స్ డే సెలబ్రేషన్.  కానీ వ్యక్తిగతంగా ఉమన్స్ డే సెలబ్రేషన్ మరోరకంగా చేశాడు.  తనకు ప్రియమైన హీరోయిన్ అయిన ఊర్మిళ మాతోండ్కర్ కు ట్విట్టర్.. ఇన్స్టా గ్రామ్ ఖాతాల ద్వారా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.  'రంగీలా' సినిమా ఊర్మిళ పోస్టర్ ను షేర్ చేసి "అందమైన రంగులను చల్లిన మహిళకు..  హ్యాపీ ఉమన్స్ డే" అంటూ ప్రత్యేకంగా విషెస్ తెలిపాడు.

ఓవర్సీస్ లో 'సైరా' సీన్ ఎంత?

Mega-Star-Chiranjeevi-Sye-Raa-Movie-Overseas-Business-Andhra-Talkies
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం `సైరా-నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. డాడ్ కోసం అన్ లిమిటెడ్ బడ్జెట్ కేటాయిస్తున్నామని చరణ్ తొలి టీజర్ ఈవెంట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించడమే కాదు.. ప్రాక్టికల్ గా దానిని చేసి చూపిస్తున్నారు రామ్ చరణ్. సైరా చిత్రాన్ని పాన్ ఇండియా కాన్వాసులో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టే కంటెంట్ ని ఎంపిక చేసుకుని విజువల్ వండర్ ని ఆవిష్కరించేందుకు తపిస్తున్నారు. నాన్నకు ప్రేమతో చరణ్ ఇస్తున్న కానుక కాబట్టి అందుకు తగ్గట్టే విజువల్స్ విషయంలో ఏమాత్రం రాజీకి వచ్చేందుకు చరణ్ సిద్ధంగా లేరని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. జార్జియాలో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ - అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లోని సెట్ లో తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకి చాలా కీలకమైనవి. సమరయోధుడి వీరత్వానికి సంబంధించిన సన్నివేశాలు నభూతోనభవిష్యతి అన్న తీరుగా తీర్చి దిద్దేందుకు వీఎఫ్ ఎక్స్ టీమ్ తో కలిసి పని చేస్తున్నారట. స్వాతంత్ర సమరాన్ని ఆరంభించిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథను విజువల్ వండర్ ని తలపించేలా చూపించడాన్ని కొణిదెల టీమ్ ఛాలెంజ్ గా భావిస్తోందట.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...