ట్వీట్ చేసి మళ్ళి దొరికిపోయిన ఆంటీ

Kasthuri-IPL-tweet-gets-trolled-Andhra-Talkies
ఏదో ఒక వివాదం లేనిదే వార్తల్లో ఉండలేమని గుర్తించిన మాజీ హీరోయిన్ కస్తూరి దీనికి సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంది. ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ ఇష్యూ లో తలదూర్చి సంచలనం రేపే ప్రయత్నం గట్టిగానే చేసింది కాని అవి పెద్దగా ఫలించలేదు. ఇటీవల ఓ ఆడియో వేడుకలో హీరో కార్తి ముందే ఆయన తండ్రి శివకుమార్ సెల్ఫీ గొడవ గురించి వ్యంగ్యంగా కామెడీ చేయబోయే అపహాస్యం పాలైన సంగతి తెలిసిందే.

భారతీయుడు-అన్నమయ్య లాంటి సినిమాల ద్వారా మనకూ పరిచయమున్న ఈ కస్తూరి కన్ను ఇప్పుడు ఐపిఎల్ మీద పడింది. దేశంలో చాలా సమస్యల కీలకమైన ఎన్నికలు ముంగిట ఉండగా ఇలా కృత్రిమ వినోదమైన క్రికెట్ కోసం ఎగబడటం ఏమిటని అర్థం వచ్చేలా తమిళ్ లో చాంతాడంత ట్వీట్ పెట్టిందిఇది కాస్త నెటిజెన్లకు ఒళ్ళు మండేలా చేసింది.ఆంటీకి గట్టి కౌంటర్లతో రిటార్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. మీలాంటి గొప్ప సంఘ సంస్కర్తలు సోషల్ మీడియాలో ఆన్ లైన్ లో తప్ప నిజమైన ప్రజా క్షేత్రంలో ఎందుకు కనిపించరు అంటూ ఘాటుగా చురకలు వేయడం మొదలుపెట్టారు. అంత చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లోకి వచ్చి సేవ చేయోచ్చుగా అంటూ క్లాసు పీకుతున్నారు.

ఏదైతేనేం మొత్తానికి ఐపిఎల్ ట్వీట్ పుణ్యమా అని కస్తూరికి తలంటు తప్పలేదు. కావేరి వివాదం చల్లారిన తరుణంలో దాన్ని మనసులో పెట్టుకుని సరిగా చెన్నై బెంగుళూరు మ్యాచ్ ఉన్నప్పుడే ఇలా చేస్తే కాలకుండా ఉంటుందా. అయినా ఇలా కోరి మరీ సోషల్ మీడియాలో చిచ్చు రేపడం కస్తూరికి ఇదేమి కొత్త కాదని తన మీద చాలా కామెంట్స్ ఉన్నాయి

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...