నా ఆస్తులమ్మి మీ పార్టీకిస్తా.. విష్ణు చాలెంజ్

Manchu-Vishnu-Challenges-Andhra-Govt-Andhra-Talkies
తన విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిల కోసం నటుడు మోహన్ బాబు రోడ్డెక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది. వైసీపీకి మద్దతుగానే మోహన్ బాబు రాజకీయం చేస్తున్నాడని టీడీపీ నేతలు ఆడిపోసుకుంటున్నారు. ఈ వివాదంలోకి మోహన్ బాబు కుమారులు కూడా ఎంటర్ అయ్యారు.

తాజాగా మోహన్ బాబు తన విద్యాసంస్థలకు రావాల్సిన బకాయిలపై తప్పుడు లెక్కలు చూపిస్తున్నారనే విమర్శలపై మంచు విష్ణు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రావడం లేదని.. ప్రభుత్వం నుంచి మేము లేఖలో పేర్కొన్న దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా.. నా ఆస్తులన్నీ అమ్మేసీ మీ పార్టీ కు ఇస్తానని మంచు విష్ణు టీడీపీ నేతలకు ఓపెన్ చాలెంజ్ చేశాడు.మానాన్న గారు 25శాతం పేద విద్యార్థులకు ఫ్రీ ఎడ్యూకేషన్ ఇస్తున్నారని..అది మీ డబ్బులతో కాదని .. నాన్న గారు నటుడిగా సంపాదించిన డబ్బులతోనే ఇవన్నీ నడిపిస్తున్నారని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా మోహన్ బాబు గళమెత్తండం.. టీడీపీ కౌంటర్ ఇవ్వడంతో మొదట మంచు మనోజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మోహన్ బాబు కుటుంబం మొత్తం టీడీపీ వ్యాఖ్యలను ఖండిస్తోంది. మనోజ్ ఏకంగా బకాయిలకు సంబంధించిన డాక్యుమెంట్లను ట్విట్టర్లో పోస్టు చేసి టీడీపీకి సవాల్ విసిరారు. ఇప్పుడీ వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...