నటించడం.. ఆపేయడం నా ఇష్టం!

Radhika-Pandit-On-Compromising-Career-After-Marrying-Yash-Andhra-Talkies
గత జెనరేషన్ వారితో పోలిస్తే ఈ సోషల్ మీడియా జెనరేషన్ వారికి ఫ్రీడమ్ చాలా ఎక్కువ ఉంది.  కానీ దీనికి నెగెటివ్ ఎఫెక్ట్ అన్నట్టుగా ప్రతి ఒక్క విషయంపై మన అమూల్య అభిప్రాయాలు పడేయడం కూడా కామన్ అయిపోయింది. నిజానికి ఎవరి పనులు వారు చేసుకోకుండా  హీరోలు ఎలా ఉండాలి..  వరదలు వస్తేఎంత డొనేషన్ ఇవ్వాలి.. హీరోయిన్లు ఎలా ఉండాలి.. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి ఇలా అన్ని నిర్ణయాలు నెటిజనులే చెప్పేస్తున్నారు.  అయినదానికీ కానిదానికి సెలబ్రిటీలను ట్రోల్ చేయడం కూడా చాలా సాధారణం అయిపోయింది.  ఇలానే రీసెంట్ గా 'కేజీఎఫ్' స్టార్ యష్ సతీమణి రాధిక పండిట్ కు నెటిజనుల నుండి హీట్ తగిలింది.


యష్ ను వివాహం చేసుకోక ముందే రాధిక కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్లు కూడా ఉన్నాయి.  2016 లో యష్ ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాకు బ్రేక్ ఇచ్చింది. అప్పటికే కమిట్ అయిన సినిమాలను మాత్రం పూర్తి చేసింది.  పోయినేడాది డిసెంబర్ లో రాధిక ఒక పండంటి పాపకు జన్మనిచ్చింది.   అయితే  రీసెంట్ గా రాధిక  ఫిలిం ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి.  ఈ వార్తలకు స్పందనగా కొందరు నెటిజనులు రాధిక సినిమాలు చేయాల్సిన అవసరం లేదని.. పాపను చక్కగా చూసుకోవాలని సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు.  వీటిపై రాధిక ఘాటుగా స్పందించింది.

తనకు నచ్చినంత వరకూ నటిగా కొనసాగుతానని..  ఒకవేళ తనకు నిజంగా నటనకు గుడ్ బై చెప్పాలనిపిస్తే ఆపేస్తానని.. ఈ విషయంలో ఎవరూ తనను బలవంత పెట్టలేరని గట్టిగా సమాధానం ఇచ్చింది.  నిజమే కదా.. నటన అనేది తన ప్రొఫెషన్.. ఎప్పుడు నటించాలనుకుంటే అప్పుడు నటిస్తుంది.ఎప్పుడు ఆపేయాలనిపిస్తే అప్పుడు ఆపేస్తుంది. కానీ  'బొమ్మరిల్లు' ప్రకాష్ రాజ్ టైపులో ఆమె నిర్ణయాలు కూడా కొంతమంది నెటిజనులు తీసేసుకుంటున్నారు.  పాపం ఆ సినిమా చూసినట్టు లేదు..!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...