ఏప్రిల్ లో పెళ్లి.. బాలీవుడ్ కి పార్టీ!

Sexy-Heroin-Malaika-Arora-And-Arjun-Kapoor-To-Get-Married-In-April-2019-Andhra-Talkies
మలైకా ఆరోరాఖాన్ - అర్జున్ కపూర్ ప్రేమాయణం - పెళ్లి గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ భామ లేటు వయసు ఘాటు ప్రేమపై ఇప్పటికే బాలీవుడ్ మీడియా వేడెక్కించే కథనాలను వండి వారుస్తోంది. సదరు యువహీరోతో మలైకా షికార్లు వెంబడించి మరీ హైలైట్ చేస్తూ బాలీవుడ్ మీడియా చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రఖ్యాత క్వింట్ ఈ జోడీ ఏప్రిల్ లో పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారని ఓ ఆసక్తికర కథనం ప్రచురించింది. తాజాగా మరో అప్ డేట్ అందింది. ఈ జోడీ వివాహం పూర్తి ప్రయివేట్ ఎఫైర్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వివాహానంతరం బాలీవుడ్ ప్రముఖులకు ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారట. ఈ వేడుకకు మలైకా - అర్జున్ ఇరు కుటుంబాలకు అత్యంత  సన్నిహితులు - హితులు ఎటెండ్ అవుతారని తెలుస్తోంది.మరోవైపు తాను ఒంటరిగా ఉండాలని అనుకోవడం లేదని మలైకా మాజీ భర్త ఆర్భాజ్ ఖాన్ ఓ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన అనంతరం మలైకా స్పందించింది. ఒంటరిగా ఉండే ఆలోచన తనకూ లేదని మలైకా వ్యాఖ్యానించింది. విడాకుల వల్ల జీవితంలోకి సంతోషం వచ్చింది - నచ్చినట్టు జీవిస్తున్నానని మలైకా పేర్కొంది. చుట్టూ పరిస్థితుల గురించి ఆలోచించు అంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించింది. జీవితాంతం ఒంటరిగా ఉండాలని అనుకోవడం లేదని మలైకా స్పష్టం చేసింది. దీంతో మలైకా వైపు నుంచి లైన్ క్లియర్ అయ్యిందని అర్థమవుతోంది. అలాగే మలైకాను పెళ్లాడేందుకు ససేమిరా అని వ్యతిరేకించిన బోనీకపూర్ ఫ్యామిలీ మానసికంగా సిద్ధమవుతోందని తాజా సన్నివేశం చెబుతోంది.

దాదాపు 19 ఏళ్ల అనుబంధం తర్వాత ఆర్భాజ్ ఖాన్ నుంచి మలైకా విడిపోయింది. ఈ జంటకు 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సదరు టీనేజీ బోయ్ సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ తో ప్రేమలో ఉన్నాడని ఇదివరకూ ప్రచారమైంది. ఇక ఫేజ్ 3 ప్రపంచంలో ప్రస్తుతం మలైకా పెళ్లి వార్త అంతకంతకు వేడెక్కిస్తోంది. మలైకా- అర్జున్ కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారన్నది ప్రస్తుతం యువతరంలో హాట్ డిబేట్.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...