సీసీ టీవీ ఫుటేజ్ సాక్ష్యాలను భయట పెట్టిన శ్రీరెడ్డి

Sri-Reddy-Releases-Video-Footage-Of-Financier-Subramaniam-Andhra-Talkies
గత కొన్నాళ్లుగా చెన్నైలో ఉంటున్న శ్రీరెడ్డి తనపై హత్య ప్రయత్నం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన విషయం తెల్సిందే. పోలీసులు కేసు నమోదు చేయకుండా సుబ్రమణ్యం అనే వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ శ్రీరెడ్డి ఆరోపిస్తుంది. అర్థరాత్రి మూడు గంటల సమయంలో నేను పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేదని కనీసం కేసును రిజిస్ట్రర్ కూడా చేయలేదని ఆమె వాపోయింది. పైగా కేసు క్యాన్సిల్ చేసుకుని నేను రాజీకి వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు అంటూ శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాను రాజీ చేసుకోలేదని సుబ్రమణ్యం అనే వ్యక్తి నన్ను చంపేందుకు మనుషులతో వచ్చాడు ఆ సమయంలో నేను బెడ్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాను. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు వచ్చి నన్ను కాపాడారు అంటూ శ్రీరెడ్డి చెప్పారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఇదుగో అంటూ శ్రీరెడ్డి తన ఇంటికి సంబంధించిన కొన్ని సీసీ టీవీ ఫుటేజ్ లను విడుదల చేసింది. ఫైనాన్సియర్ అయిన సుబ్రమణ్యం హైదరాబాద్ లో కేసుల కారణంగా నాలుగు నెలల పాటు జైల్లో ఉన్నాడు. జైలు నుండి విడుదలైన వెంటనే ఇక్కడకు వచ్చాడు.ప్రస్తుతం తాను నటిస్తున్న రెడ్డీ డైరీ చిత్రంకు సైతం ఆయనే ఫైనాన్సియర్ గా చేస్తున్నాడు. అందుకే హైదరాబాద్ పోలీసులు మమ్ములను ఆ విషయమై ప్రశ్నించారు. అంత మాత్రాన ఆయన్ను మేమే పట్టించామని అనుకున్నాడు. అందుకే నన్ను చంపేందుకు నా మీదకు మనుషులతో వచ్చాడు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ నాపై దాడికి ప్రయత్నించాడు అంటూ శ్రీరెడ్డి ఆరోపించింది. నన్ను చంపే ఉద్దేశ్యం లేకుంటే సీసీ కెమెరాలను ఆఫ్ చేయాల్సిన అవసరం ఏంటీ అంటూ ఆమె ప్రశ్నిస్తుంది. చెన్నై పోలీసులు ఈ కేసును ఎలా ఫైల్ చేయాలో అర్థం కాక హోల్డ్ లో పెట్టినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...