క్రిష్ ను ఇంకా వదలని కంగనా..!

krish-kangana-Andhra-talkies
దర్శకుడు క్రిష్ మీద కంగనాకి పీకలదాకా కోపమన్న సంగతి మనందరికీ తెలిసిందే! ఆ కోపం ఎందుకు వస్తుందో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. కంగనాతో వేగలేక క్రిష్ "మణికర్ణిక" నుంచి తప్పుకున్నా క్రిష్ మీద కంగనా విసుర్లు ఆగడం లేదు. నిన్న మొన్నటి దాకా తన సినిమాను చెత్తగా తీశాడని అందుకే రీషూట్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు "కధానాయకుడు",మహానాయకుడు" మీద పడింది. ఈ రెండు సినిమాలు ప్లాఫ్ కావడానికి క్రిష్ కారణమని ఆ రెండు సినిమాలు పరమ చెత్తగా తీశాడని అంటోంది. ఈ సినిమాల పరాజయంలో బాలకృష్ణ ప్రమేయం ఏమీ లేదని, ఆయన చాలా బాగా చేసినా, దర్శకుడు ప్రతిభావంతుడు కాకపోవడంతో ఫలితం తిరగబడిందని చెప్పుకొచ్చింది. కంగనా వరస చూస్తుంటే క్రిష్ ని ఇప్పుడప్పుడే వదిలేలా లేదని సినీ జనాలు అంటున్నారు. హృతిక్ లాంటి హీరోనే కంగనా దెబ్బకు కామ్ అయ్యిపోవాల్సి వచ్చిందనీ, ఇంక క్రిష్ గురించి చెప్పుకోనక్కరలేదనీ అంటున్నారు. ఇంతకీ వీరిద్దరి గొడవకు అసలు కారణాలేమిటో..?

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...