మజిలీకి ఫ్లాట్ అయిన సెలబ్రిటీలు

Celebs-Praises-Naga-Chaitanya-and-Samantha-Majili-Movie-Andhra-Talkies
అక్కినేని నాగ చైతన్య.. సమంతాలు జంటగా నటించిన 'మజిలీ' శుక్రవారం రిలీజ్ అయింది.  మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో ఓపెన్ అయిన ఈ సినిమాకు రివ్యూస్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి.  సాధారణ ప్రేక్షకుల హృదయాలనే కాదు సెలబ్రిటీల హృదయాలను కూడా టచ్ చేసింది ఈ సినిమా.  పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ సినిమా పై ట్విట్టర్ ద్వారా ప్రశంసల వర్షం కురిపించారు.

లేడీస్ ఫస్ట్ కాబట్టి.. ఫైర్ బ్రాండ్ లేడీ మంచు లక్ష్మి ట్వీట్ తో మొదలు పెడదాం.  "మజిలి ఫెంటాస్టిక్ ఫిలిం.  తెలుగులో చాలా రోజుల తర్వాత నేను చూసిన నిజాయితీతో కూడిన ఒక అద్భుతమైన హార్ట్ టచింగ్ లవ్ స్టొరీ. సామ్ & చై లు చించేశారు.. కాదు 'చంపేశారు'.  మొత్తం క్యాస్టింగ్ సూపర్బ్.  హ్యాట్సాఫ్ టూ యు శివ నిర్వాణ.. మీపట్ల గౌరవం పెరిగింది. అందరూ త్వరగా వెళ్లి సినిమాను ఈరోజే చూడండి"మంచు మనోజ్:  "మజిలీ క్యూటెస్ట్ కపుల్ చై-సామ్ నుండి వచ్చిన ఒక అందమైన ఎమోషన్.  ఇలాంటి లవ్లీ మూవీని అందించినందుకు మీ ఇద్దరికీ.. మజిలీ టీం అందరికీ కంగ్రాట్స్."

దర్శకుడు బాబీ: "నా హృదయ తంత్రులను గట్టిగా మీటింది. చైతన్య.. సమంతా లు ది బెస్ట్ ఇచ్చారు. టాలీవుడ్ లో శివ నిర్వాణ నెక్స్ట్ బిగ్ థింగ్.  లవ్ కు కొత్త డెఫినిషన్ ఇచ్చాడు.  థమన్ సినిమాకు ఆత్మలాంటి ఆర్ ఆర్ ఇచ్చాడు.  మజిలీ టీమ్ కు కంగ్రాట్స్ .

దర్శకుడు హరీష్ శంకర్:  "నాగ చైతన్య.. సమంతాలు ఈ లోకంలో ఉండే అన్ని ప్రశంసలకు అర్హులు. శివ నిర్వాణ మీ కన్విక్షన్ గ్రేట్.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో థమన్ ఎమోషన్స్ ను చక్కగా క్యారీ చేశాడు.  సుబ్బరాజు.. రావు రమేష్ గారు.. చాయ్ బిస్కట్ సుహాస్ అందరూ సూపర్.  ఒక సెన్సిబుల్ ఫిలిం తో సమ్మర్ ఓపెన్ అయింది."

నిర్మాత మథుర శ్రీధర్ రెడ్డి:  "మజిలీకి తెలుగు సినిమాలోని ప్రేమ కథల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది."

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...