మోస్ట్ డేంజరస్ క్రిమినల్ బయోపిక్ తీస్తున్న రాంగోపాల్ వర్మ!

దావూద్ ఇబ్రహీం.. చోటా షకీల్  గ్యాంగ్ లు ఇనాక్టివ్ గా ఉన్నాయి కానీ.. ఒకవేళ యాక్టివ్ గా ఉండి ఉంటే ఈ క్రిమినల్ ని చూసి ఉరి వేసుకునేవారేమో. ఒసామా బిన్ లాడెన్ అమెరికా బాంబ్ దాడుల్లో చనిపోకపోయి ఉంటే అతడు కచ్ఛితంగా హర్టయ్యేవాడు. అసలు నేను భారతదేశంలో పుట్టి ఉంటే ఈయనలా ఉండేవాడినని ఫీలయ్యేవాడే... అందుకే అతడిని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో చేర్చారు. ఇంతకీ ఎవరీయన? అంటే ఆయనే ఆర్జీవీ అలియాస్ వివాదాల రామ్ గోపాల్ వర్మ సినిమాలో హీరో అన్నమాట.

ఆర్జీవీ నటుడిగా తెరంగేట్రం చేస్తున్నారు అనగానే ఒకటే ప్రకంపనలు. ఇన్నాళ్లు ఎన్నో చేసినా ఆర్జీవీ చేయనిది అదొక్కటే. పైగా ఆయన డెబ్యూ సినిమా పేరు కోబ్రా అనగానే మరోసారి జనం కంగారు పడ్డారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓడ్కా సాక్షిగా ఈ సినిమాని ప్రకటించారు. కోబ్రా అన్న టైటిల్ ని ప్రకటించగానే అందరిలో ఒకటే సందేహాలు. ఇంతకీ ఆ కోబ్రా ఎవరు?  ఆర్జీవీయేనా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం ఓడ్కా పార్టీ చేసుకున్న ఆర్జీవీ ఆ వోడ్కా కిక్కులో సినిమా పోస్టర్ ని కూడా లాంచ్ చేశాడు. ఈ పోస్టర్ కి అనూహ్య స్పందన వస్తోంది. అసలు సిసలు దావూద్ తర్వాత నేనే అన్నట్టుగా ఆర్జీవీ కనిపిస్తున్నా అతడు ఇందులో విలన్ కాదు. ఒక సిన్సియర్ పవర్ ఫుల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నారట.


నీ శత్రువును చంపమని నువ్వు ఒక పామును నియోగిస్తే ఆ పాము వచ్చి ఏదో  ఒక రోజు నిన్ను కాటేసి చంపేస్తుంది.. అంటూ ఓ నిత్య సత్యాన్ని క్రమినల్ మైండ్ లోని ఆలోచనల్ని కోబ్రా పోస్టర్ పై ఆవిష్కరించారు. అంటే నమ్మిన వాడినే హతమార్చే కాలాంతకుడిగా నటిస్తున్న ఆ నటుడి పేరు కేజీ. ఇందులో సీఎం కేసీఆర్ పాత్ర కూడా ఉంది. కేసీఆర్ పాత్రలో రంగారావు నటిస్తున్నారని వెల్లడించారు. అన్నట్టు ఈ కథ ఎవరి జీవితం స్ఫూర్తితో రాసుకున్నది? అన్నది మాత్రం ఆర్జీవీ చెప్పలేదు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బయోపిక్ అని ప్రకటించాడు. నిస్సందేహంగా ఇది ఓ రాజకీయ నాయకుడి బయోపిక్ అయ్యి ఉండొచ్చు. అది ఎవరు అన్నది వర్మనే బయటపెడతాడేమో చూడాలి. ఆయనే నటుడు.. ఆయనే దర్శకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలాంటి వివాదాలకు తావివ్వనుందో?

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...