లారెన్స్ కచ్చితంగా దయ్యం హీరోనే

Kanchana-Hero-Raghava-Lawrence-Land-Mark-for-Horror-Movies-Andhra-Talkies
ఒక్కోక్కరికి ఒక్కో రకమైన సినిమాలు బాగా కలిసివస్తుంటాయి. అవి వారికి సెంటిమెంట్ గా మారిపోతుంటాయి. ఇప్పుడు లారెన్స్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. దర్శకుడు లారెన్స్ ఇప్పుడు దయ్యాల సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ లా తయారయ్యాడు. దయ్యాల సినిమాలు మినహాయిస్తే.. లారెన్స్ కు వేరే సినిమాలు అంతగా కలిసిరావడం లేదు. ఏ టైమ్ లో కాంచన సిరీస్ స్టార్ట్ చేశాడో కానీ అప్పటినుంచి నాన్ స్టాప్ గా హిట్స్ కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు కాంచన -3 మరోసారి హిట్ ని తన ఎక్కౌంట్ లో వేసుకున్నాడు లారెన్స్.
 
ఎవ్వరేమనుకున్న లారెన్స్ చెయ్యాల్సింది చేస్తాడు. దయ్యాల సినిమాలతోనే హిట్స్ కొడుతున్నాడని విమర్శించినా అల్టిమేట్ ఇండస్ట్రీలో నిలబడాలంటే కావాల్సింది హిట్. అందుకే లారెన్స్ కూడా ఈ విమర్శల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే  రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాడు.కాంచన 3 హిట్ తో పిచ్చ ఆనందంలో ఉన్న లారెన్స్ ఇప్పుడు తన సిరీస్ ను కంటిన్యూ చేయబోతున్నాడు. త్వరలో కాలభైరవ పేరుతో మరో హారర్ కామెడీ ఎంటర్ టైనర్ ని స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే దీనికి కొంచెం సమయం పట్టొచ్చు. ఎందుకంటే.. ప్రస్తుతం లారెన్స్ హిందీ సినిమాలో బిజీగా ఉన్నాడు. అక్షయ్ కుమార్ తో కాంచన 2ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన తర్వాత కాలభైరవను మొదలుపెడతానని ఎనౌన్స్ చేశాడు. మొత్తానికి ఇండియన్ ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ లా  తయారయ్యాడు లారెన్స్.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...