గుమ్మడికాయ కొట్టేసుకున్న మహర్షి

Maharshi-Movie-Wrap-Up-Celebrations-In-Hyderabad-Andhra-Talkies
మహర్షి మే 9 విడుదల అని పక్కాగా ప్రకటించినప్పటికీ ఇంకా కొంత షూటింగ్ బాలన్స్ ఉందన్న వార్తల నేపథ్యంలో కొంత ఆందోళనకు గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ మహేష్ బాబు స్వయంగా షూటింగ్ పూర్తయిన విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఇట్స్ ఏ రాప్ అంటూ ఆ సందర్భంగా కట్ చేసిన కేకు తాలూకు ఫోటో పోస్ట్ చేసిన మహేష్ వచ్చే నెల 9న థియేటర్లలో కలుసుకుందామంటూ మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు.

దీని తాలూకు వీడియో కూడా ఆన్ లైన్ లో రచ్చ చేస్తోంది. యూనిట్ మొత్తం ఓ వేడుకగా జరుపుకున్న గుమ్మడికాయ సంబరంలో హీరోయిన్ పూజా హెగ్డే తో సహా అందరూ పాల్గొన్నారు. సో ఏమైనా బాలన్స్ అనుమానాలు ఉంటే వాటికి పూర్తిగా చెక్ పడిపోయింది. ఇంకో 20 రోజులు మాత్రమే టైం ఉండటంతో మహర్షి టీం పబ్లిసిటీ వేగాన్ని పెంచనుంది. ప్రీ రిలీజ్ డేట్ ట్రైలర్ ఎప్పుడు వదిలేది లాంటి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రిన్స్ కూడా మీడియాకు అందుబాటులో ఉంటూ ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు ఇన్ సైడ్ టాక్.సో మహర్షి ప్రమోషన్ హంగామా ఇంకో రెండు మూడో రోజుల్లో ప్రారంభం కానుంది. మహేష్ రేంజ్ స్టార్ హీరో సినిమా లేక డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ కు మహేష్ కొత్త ఊపిరి ఇవ్వడం ఖాయమని ట్రేడ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఎఫ్2 తర్వాత ఇండస్ట్రీ రికార్డులను టార్గెట్ చేసిన సినిమా రాలేదు. మజిలీ హిట్టు కొట్టినప్పటికీ దాని రేంజ్ అది కాదు. సో మహర్షి తిరగరాయబోయే వసూళ్ల రికార్డుల కోసం అభిమానులు అప్పుడే కౌంట్ డౌన్ మొదలుపెట్టేసుకున్నారు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...