ట్రైలర్ టాక్ : గందరగోళ మేళం

Posani-Swayamvada-Movie-Trailer-Andhra-Talkies
నాగార్జున కింగ్ సినిమాలో ఓ సింగింగ్ షోకి జడ్జ్ గా వచ్చిన బ్రహ్మానందం చెప్పే డైలాగ్ ఒకటుంటుంది. తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళాలి అనుకుంటే మీరు మాత్రం రాము అక్కడే ఉంటాం అంటారు అని. ఇది మేమ్స్ లో బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా ఇప్పటికీ వాడుతుంటారు. ఇప్పుడీ సంగతి ఎందుకు వచ్చింది అంటారా. తాజాగా విడుదలైన స్వయంవద ట్రైలర్ చూశాక అదే ఫీలింగ్ కలిగింది కాబట్టి. ముందు కథ సంగతేంటో చూద్దాం.

బాగా డబ్బున్న స్వయంవద(ఆదిత్య అల్లూరి) మధ్యతరగతి కుటుంబానికి చెందిన సుబ్బారాయడు(అనితా రావు)కు పెళ్ళవుతుంది. అరుదైన బ్లడ్ గ్రూప్ కు చెందిన ప్రియంవదకు చిన్న అవమానం జరిగినా తట్టుకునే రకం కాదు. ఎంతకైనా తెగిస్తుంది. ఓ దశలో తనలో దెయ్యం లక్షణాలు ఉన్నాయని గుర్తించిన సుబ్బు ఆమె బారి నుంచి రక్షించమని ఓ ఏజెంట్(ధన రాజ్)ను కలుస్తాడు. కాని వ్యవహారం ఇంకాస్త ముదిరి హత్యల దాకా వెళ్తుంది. మరి స్వయంవద లక్ష్యం ఏమిటి ఎందుకు సుబ్బును టార్గెట్ చేసింది అనేదే దీని కథమేకింగ్ స్టాండర్డ్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హీరో హీరొయిన్లు ఏ కోశానా ఆకట్టుకునే కనీస స్థాయిలో లేకపోగా అతుకుల బొంతలాగా అనిపిస్తున్న కథనం ఖంగాలీ పడుతూ తీసినట్టుగా అనిపించే దర్శకత్వం ఏ దశలోనూ ఆసక్తి కలిగించేలా లేవు. పోసాని కృష్ణ మురళి ధన రాజ్ లాంటి ఒకరిద్దరు సీనియర్లు తప్ప అంతా కొత్తవాళ్ళతో చేసిన ఈ ప్రయత్నాన్ని కనీసం ట్రైలర్ దశలోనైనా ఇంట్రెస్ట్ కలిగేలా కట్ చేయలేకపోయారు. ఇక నటనల గురించి చెప్పడానికి ఏమి లేదు. సంగీతం ఛాయాగ్రహణం కూడా తమ వంతుగా హెల్ప్ లెస్ గా మిగిలాయి. వివేక్ వర్మ దర్శకత్వం వహించిన స్వయంవద ఈ నెల 26న విడుదల కానుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...