కంగనా తిట్లకు అసలు కారణం అదా?

Reason-Behind-Sexy-Heroin-Kangana-Targets-Alia-Bhatta-Andhra-Talkies
ఆలియా భట్ తన పనేదో తాను చేసుకుంటోంది. చక్కగా నటిస్తోంది. హిట్లు కొడుతోంది. ఏ వివాదంలో తల దూర్చకుండా సాగిపోతోంది. కానీ ఆమెను అదే పనిగా గిచ్చి గిచ్చి వివాదాల్లోకి లాగుతోంది కంగనా రనౌత్. ఆమెతో పోలిస్తే కంగనా నటిగా తక్కువే కావచ్చు. కానీ తన స్థాయిలో ఆమె బాగానే నటిస్తోంది. ఎప్పుడూ ఆలియా.. కంగనా జోలికి వచ్చింది లేదు. ఆమెను తక్కువ చేసి మాట్లాడింది లేదు. కంగనా అదే పనిగా తనను టార్గెట్ చేసినా కూడా ఆమె హుందాగానే స్పందిస్తోంది. అయినా కంగనా.. ఆలియాను విడిచిపెట్టకుండా అదే పనిగా గిచ్చుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. నటిగా ఆలియా తక్కువ చేసి మాట్లాడటమే కాక.. ఆమె బ్యాగ్రౌండ్ గురించి రణబీర్ కపూర్ తో ప్రేమాయణం గురించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది కంగనా.మరి ఇంతలా ఆలియాను ఆమె టార్గెట్ చేయడానికి కారణం ఏంటి.. ఆలియా ఎందుకు సైలెంటుగా ఉంటోంది అన్న సందేహాలు కలుగుతున్నాయి అందరికీ. దీని వెనుక కారణమేంటో కంగనా సోదరి రంగోలి చెప్పకనే చెప్పింది. ఒకప్పుడు కంగనా చిన్న స్థాయి కథానాయికగా ఉండగా.. మహేష్ భట్ నిర్మాణంలో ‘వో లమ్హే’ అనే సినిమా చేసింది. ఐతే ఈ సినిమా మేకింగ్ టైంలో మహేష్ భట్.. కంగనాను చాలా తక్కువగా చూశాడట. ఆమె పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడట. ఒక సందర్భంలో కంగనా మీదికి ఆయన చెప్పు కూడా విసిరారంటూ రంగోలి సంచలన ఆరోపణ చేసింది.

కంగనాకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోవడంతో ఆమెను మహేష్ భట్ తక్కువగా చూశారంటోంది రంగోలి. దీంతో మహేష్ భట్ తో పాటు బిగ్ షాట్స్ అందరి మీదా కంగనా కోపం పెంచుకున్నట్లుంది. స్టార్ కిడ్స్ పట్ల వీళ్లందరూ చాలా ప్రేమగా ప్రవర్తించడం బ్యాగ్రౌండ్ లేని వాళ్ల పట్ల అమర్యాదకరంగా వ్యవహరించడంపై మండిపోయి.. తనకంటూ ఒక స్థాయి వచ్చాక వాళ్లను టార్గెట్ చేస్తున్నట్లుంది కంగనా. మహేష్ భట్ యాక్టివ్ గా లేడు కాబట్టి ఆయన తనయురాలిని లక్ష్యంగా చేసుకుని ఆయనకు మంట పుట్టేలా చేయడమే కంగనా ప్లాన్ లాగా ఉంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...