పాయల్ లా టాలీవుడ్ ని ఊపేస్తుందా?

Sexy-Actor-Digangana-Suryavansi-in-Hippi-Movie-Andhra-Talkies
ఆర్.ఎక్స్ 100 హీరో కార్తికేయ సరసన `హిప్పీ` చిత్రంలో నటిస్తోంది దిగంగన సూర్యవంశీ. ముంబై నుంచి దిగుమతి అవుతున్న ఈ ఉత్తరాది బ్యూటీ అందచందాలు తెలుగు యువతకు పట్టేయనున్నాయా? అంటే అవుననే ఈ అమ్మడి లుక్ చెబుతోంది. దిగంగన అంటూ పేరు కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నా.. అందం.. ప్రతిభలో ఈ అమ్మడు మేటి అంటూ గడ్డం చక్రవర్తి అంతటివారే కితాబిచ్చారు. కార్తికేయ లాంటి ఎనర్జిటిక్ హీరోతో రొమాన్స్ చేస్తోంది. హిప్పీలో దిగంగనతో ఘాటైన రొమాన్స్ కన్ఫామ్ అని ఇప్పటికే రివీలైన పోస్టర్లు చెబుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో చిత్రయూనిట్ ఈ అమ్మడిని పరిచయం చేసింది.టాలీవుడ్ కి పరిచయం అవుతున్న ఈ అమ్మడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంటే.. చాలానే ఉంది. సల్మాన్ హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్9 పార్టిసిపెంట్ గా సుపరిచితం. అటుపై స్టార్ ప్లస్ లో `ఏక్ వీర్ కి అర్దాస్` అనే టీవీ సీరియల్ లో వీరగా పరిచయమైంది. మోడల్ గానూ కెరీర్ ని సాగించి ఇప్పుడు టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. ఫ్రైడే జలేబి రంగీలా రాజా చిత్రాల్లో నటించింది. 2002 నుంచి 2016 వరకూ బుల్లితెరపై రకరకాల పాత్రలు పోషించింది. సుదీర్ఘమైన అనుభవం ఉన్న నటిగా పాపులరైంది. ప్రస్తుతం రెండు సినిమాల కిడ్ కార్తికేయ సరసన నటిస్తోంది.

హిప్పీ అంటే ప్రేమ సంచారి. దిగంగన ఈ ప్రేమసంచారితో ఎలాంటి రొమాన్స్ చేసింది? అనేది తెలియాలంటే కాస్త ఆగాల్సిందే. మల్లూ భామల హవా నడుమ టాలీవుడ్ లో ప్రవేశిస్తున్న ఈ ప్రతిభావని ఇక్కడ కెరీర్ ని ఎలా మలుచుకుంటుంది? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. కార్తికేయ సరసన ఆర్.ఎక్స్ 100లో నటించిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ నాయికగా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. అంతే దూకుడు ఈ అమ్మడు కూడా చూపిస్తుందా? అన్నది కాస్త ఆగితే కానీ తెలీదు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...