ఎంపీగా గెలిచిన హాట్ హాట్ హీరోయిన్

Former-actress-Navneet-Kaur-Rana-defeats-Shiv-Sena-veteran-Anandrao-Adsul-Andhra-Talkies
తనదైన అందం చందంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన కథానాయిక నవనీత్ కౌర్. `శీను వాసంతి లక్ష్మీ` చిత్రంతో టాలీవుడ్ లో ప్రవేశించిన ఈ పంజాబీ బ్యూటీ అటుపై అగ్ర హీరోలు సహా పలువురు యువహీరోల సరసన నటించింది.  శీను వాసంతి లక్ష్మీ.. శత్రువు.. మహారధి తదితర చిత్రాల్లో నటించింది.  గ్లామరస్ నాయికగా ఐదారేళ్ల పాటు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. అయితే ఆశించిన స్థాయి విజయాలు దక్కకపోవడంతో కెరీర్ పరంగా వెనకబడింది. ఆ క్రమంలోనే కొన్ని ఐటెమ్ నంబర్లలోనూ నర్తించి యూత్ ని ఆకట్టుకుంది.

ఇక సినీపరిశ్రమను విడిచిపెట్టాక స్వస్థలం మహారాష్ట్ర లోనే నవనీత్ సెటిలైంది. అక్కడే రవిరాణా అనే ఎమ్మెల్యేని పెళ్లి చేసుకుని లైఫ్ లో స్థిరపడింది. రవిరాణా స్వాభిమాన్ పార్టీ తరపున తొలి నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో నవనీత్ తన భర్త అడుగు జాడల్లోనే రాజకీయారంగేట్రం చేసింది. లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర లోని అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి శివసేన పార్టీ అభ్యర్థిపై దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. నవనీత్ కి 5లక్షల 10 వేల ఓట్లు పోలయ్యాయి.

మోదీ బయోపిక్ తెలుగు రాష్ట్రాల్లో రాదా?

Indian-PM-Narendra-Modi-Biopic-in-Telugu-Andhra-Talkies
బయోపిక్ ల ట్రెండ్ లో రాజకీయ నాయకుల బయోపిక్ లు జోరుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్.. వైయస్సార్.. థాక్రే .. మన్మోహన్ సింగ్ బయోపిక్ లు తెరకెక్కి రిలీజయ్యాయి. ఇవన్నీ ఎన్నికల ముందే రిలీజయ్యాయి. అయితే ఎన్నికల సమయంలో తెరకెక్కిన `పీఎం నరేంద్ర మోదీ` బయోపిక్ మాత్రం రిలీజ్ కాలేదు. ఈసీ ఆంక్షలతో ఎట్టకేలకు ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఈ సినిమా రిలీజైంది.

రిలీజైంది .. సరే.. ఈ చిత్రాన్ని మొత్తం 23 భాషల్లో రిలీజ్ చేస్తున్నామని తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు వెర్షన్ రిలీజవుతుందని ప్రకటించారు. అయితే మోదీ బయోపిక్ తెలుగు వెర్షన్ కి సంబంధించిన సరైన సమాచారం ఏదీ లేదు ఇంతవరకూ. ఇంతకీ ఇది తెలుగు రాష్ట్రాల్లో రిలీజవుతుందా లేదా? అన్నది తెలియాల్సి ఉందింకా.

డౌన్ డౌన్ చంద్రబాబు.. జిందాబాద్ ఎన్టీఆర్

Telugu-Desam-Party-Cadre-Looking-For-Jr-NTR-Andhra-Talkies
చరిత్రలో ఎన్నడూ చూడని ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో. ఈ దెబ్బతో పార్టీ భవితవ్యమే ప్రమాదంలో పడిపోయింది. చంద్రబాబు అధికారంలో లేనపుడు ఎంత బలహీనంగా కనిపిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 2004లో అధికారం కోల్పోయి పదేళ్లు ప్రతిపక్షంలో ఉండగా జావగారిపోయారు. తెలంగాణలో పార్టీని తగలబెట్టేశారు. మామూలుగా అయితే 2014లోనూ ఆయన అధికారంలోకి వచ్చేవారు కాదేమో. కానీ రాష్ట్రం విడిపోవడం కలిసొచ్చి అధికారం అందుకున్నారు. అది కూడా స్వల్ప ఓట్ల తేడాతో. జగన్ ప్రతిపక్షంలో ఉండగానే చంద్రబాబును ముప్పుతిప్పలు పెట్టారు. 2014కు ముందు చాలామంది నాయకుల్ని ఆకర్షించారు. ఇప్పుడు ఇంతటి ఘనవిజయంతో అధికారంలోకి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? 70 ఏళ్లకు చేరువ అవుతున్న చంద్రబాబు ఈ స్థితిలో నాయకులకు భరోసా ఇచ్చి పార్టీని నిలబెట్టుకోవడం అంటే అసాధ్యమైన విషయమే.

విక్రంకు దర్శకుడి వార్నింగ్

Director-Bala-Sends-Legal-Notice-To-Actor-Vikram-Andhra-Talkies
సౌత్ దర్శకుల్లో చాలా ప్రత్యేకమైన గుర్తింపు పేరు ఉన్న బాలాకు జరగకూడని అవమానం అర్జున్ రెడ్డి రిమేక్ వర్మ విషయంలో జరిగిన సంగతి తెలిసిందే. ఫైనల్ వెర్షన్ చూశాక చెత్తగా ఉందంటూ దాన్ని పక్కన పెట్టేసి సందీప్ అసిస్టెంట్ గిరిసాయతో కొత్త వెర్షన్ మొదలుపెట్టారు. దాని షూటింగ్ కూడా చాలా వేగంగా కేవలం మూడు నెలల్లో పూర్తయిపోయింది. ఇంత ఫాస్ట్ గా ఎలా తీశారా అని అందరూ ఆశ్చర్యపోయారు కూడా.

ఇదే అనుమానం బాలాకు వచ్చినట్టు ఉంది. తను తీసిన భాగంలోని సీన్స్ ఏమైనా వాడుకున్నరేమో అని విక్రం తో పాటు సదరు సంస్థలు లీగల్ నోటీసులు పంపినట్టు చెన్నై మీడియా టాక్. మీరు వద్దనుకుని పక్కన పెట్టిన తాను తీసిన ఫస్ట్ వెర్షన్ లో ఏ సీన్ వాడుకున్నా చట్టరిత్యా చర్యలు ఉంటాయని అందులో పేర్కొన్నట్టు తెలిసింది. అయితే దీనికి ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. కారణం హీరొయిన్ తో సహా దాదాపు స్టార్ క్యాస్టింగ్ మొత్తం మార్చి ఫ్రెష్ గా రీమేక్ చేశారు.

విడాకులకు సిద్దమైన మరో స్టార్ కపుల్

Imran-Khan-And-Avantika-Divorce-After-8-Years-Of-Marriage-Andhra-Talkies
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కెరీర్ పరంగా చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నాడు. హీరోగా ఇమ్రాన్ ఖాన్ కెరీర్ ఆరంభంలో ఆకట్టుకున్నాడు. కాని ఆ తర్వాత మెల్ల మెల్లగా అతడు హీరోగా ఫ్లాప్ అవుతూ వచ్చాడు. ఒకానొక దశలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ప్రయత్నాలు చేశాడు. కాని అలా కూడా అతడు సఫలం కాలేదు అతడికి ఆఫర్లు దక్కలేదు. దాంతో నటనను పక్కన పెట్టి డైరెక్షన్ కూడా ప్రయత్నించాడు. ఒక వైపు సినీ కెరీర్ ఏమాత్రం ఆశాజనకంగా లేని ఈ సమయంలో మరో వైపు వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తలెత్తాయి.

నేను పిలిస్తే కాజల్ కాదనదు: ప్రముఖ డైరెక్టర్

She-Don-t-Say-No-When-I-Call-Her-Says-Director-Teja-Andhra-Talkies
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత అందం అభినయంతో ఆకట్టుకుని బడా హీరోల సరసన ఎన్నో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోలుగా వెలుగొందుతున్న అందరితో కాజల్ నటించింది. చేతి నిండా సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. కథల ఎంపిక విషయంలోనూ ఆమె తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఈ మధ్య సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటోంది. తాజాగా ఆమె ‘సీత’ అనే సినిమాలో నటిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను తేజ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా మే 24న విడుదల కాబోతుంది.

అందుకోసం ఎన్ని సార్లైనా తల్లినవుతా: అనసూయ షాకింగ్ కామెంట్స్

I-Wants-Baby-Girl-Says-Anasuya-Bhartwaj-Andhra-Talkies
అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై కనిపిస్తూ సందడి చేస్తోంది ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్. నటన అందం కలగలపిన అమ్మాయి కావడంతో తెలుగు ప్రేక్షకులు అనతి కాలంలోనే ఆమెను ఆదరించారు. అందుకే అనసూయ అనే పేరు పరిచయం అవసరం లేనంతగా మారిపోయింది. వాస్తవానికి మొదట ఓ న్యూస్ చానెల్ లో పని చేయడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో బాగా ఫేమస్ అయిపోయింది. ఈ షో భారీ హిట్ కావడంతో అమ్మడికి ఎన్నో చానెళ్ల నుంచి అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. ఇలా టీవీ షోలు చేస్తున్న క్రమంలోనే సినిమా అవకాశాలు కూడా దక్కాయి. దీంతో చేతి నిండా టీవీ షోలు సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది ఈ హాట్ బ్యూటీ.

కంగన మెంటల్ టార్చర్ భరించలేకపోతున్న హృతిక్ రోషన్!

Hrithik-Roshan-unable-to-bear-Kangana-Mental-Torture-Andhra-Talkies
క్వీన్ కంగన రనౌత్ .. హృతిక్ రోషన్ మధ్య వివాదం గురించి తెలిసిందే. క్రిష్ 3 సమయం నుంచి ఆ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ వివాదంలోకి హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ని కంగన లాగడంతో అతడు ఈ భామపై భగ్గుమన్నాడు. అప్పట్లో కోర్టుల వరకూ వెళ్లింది ఈ గొడవ. కంగన తన సిస్టర్ రంగోలి సాయంతో హృతిక్ అండ్ గ్యాంగ్ పై ప్రతిసారీ మాటల యుద్ధం చేస్తోంది. వీలున్న ప్రతి వేదికపైనా పురుషాధిక్య ప్రపంచాన్ని అలానే హృతిక్ ని కలిపి గంపగుత్తగా తిట్టేస్తోంది కంగన. అయితే ఈ ఎపిసోడ్స్ వల్ల హృతిక్ తీవ్రంగా మనస్థాపానికి గురవుతూనే ఉన్నారు. ఒక రకంగా మహిళా ప్రపంచంపై సింపథీని కంగన తెలివిగా క్యాష్ చేసుకుంటూ తన శత్రువుల్ని చీల్చి చెండాడుతోంది. తనని కెరీర్ ఆరంభంలో ఆడుకున్న ఈ మగ ప్రపంచాన్ని తూట్లు పొడిచే ఏ అవకాశాన్ని కంగన అస్సలు వదులుకోవడం లేదు.

ఓరేయ్.. అంటూ డైరెక్టర్ చెంప పగలకొట్టిందట!

Actor-Raksha-Slaps-Director-Andhra-Talkies
తెలుగు.. తమిళ.. కన్నడ.. మలయాళ చిత్ర కథానాయికగా దాదాపు 30 సినిమాల్లో నటించారు రాణి అలియాస్ రక్ష. కనుసైగతో కుర్రకారు కుదేలైపోయేలా చేసిన ఆమె నచ్చావులే చిత్రంలో అమ్మగా రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఆమె.. తాజాగా ఒక ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగ ఆమె సంచలన అంశాల్ని వెల్లడించారు. తన పట్ల అనుచితంగా ప్రవర్తించే వారికి ఎదురుదెబ్బలు తప్పలేదన్న విషయాన్ని చెప్పిన ఆమె.. ఒక దర్శకుడిని అందరి ఎదుట తిట్టటమే కాదు.. చెంప ఛెళ్లుమనిపించిన వైనాన్ని వెల్లడించారు.

ఇంతకీ అసలేం జరిగిందో చెబుతూ.. ఆ దర్శకుడితో ఒక సినిమా చేశా.. తర్వాత ఆయన్ను కలిసింది లేదు. తమిళంలో ఒక కథ చెప్పారు. గ్లామర్ పాత్ర చేయటం లేదని.. పెళ్లి అయ్యిందని చెప్పా. పాప కూడా ఉందని.. స్లీవ్ లెస్ డ్రెస్ లు  వేసుకోనని చెప్పా. మంచిపాత్ర అని చెప్పి ఒప్పించారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు సుడి మామూలుగా లేదు

Super-Star-Mahesh-babu-Confident-on-Maharshi-Movie-Andhra-Talkies
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని మహేశ్ నటించిన సినిమా మహర్షి. దీంతో.. ఈ మూవీతో కూడా బంపర్ హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు మహేశ్. మహర్షి సినిమా కోసం మహేశ్ బాగానే కష్టపడ్డాడు. అయితే.. ఎంత కష్టపడినా సినిమాకు మాత్రం అస్సలు హైప్ రాలేదు. ఎంత ప్రమోషన్ చేసినా - టీవీల్లో ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా అందరూ అవెంజర్స్ గురించి మాట్లాడుతున్నారు తప్ప మహర్షి గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడడం లేదు.

మహర్షి సినిమా ట్రైలర్ ఆడియన్స్ కి మరీ ముఖ్యంగా అభిమానులకు అస్సలు నచ్చలేదు. అయితే.. సినిమా ఎలా ఉన్నా సరే.. రిలీజ్ కు ముందే తన మ్యూజిక్ తో మంచి హైప్ తెచ్చే దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈసారి మహేశ్ కు హ్యాండ్ ఇచ్చినట్లే కన్పిస్తుంది. ఒక్కటంటే ఒక్క పాట కూడా సూపర్ హిట్ అవ్వలేదు సరికదా.. అసలు ఇవి మహేశ్ సినిమాలో పాటలేనా అన్పించేంతగా చిరాకు పుట్టిచ్చాయి. మహర్షి ఆడియోపై సోషల్ మీడియాలో కూడా బీభత్సమైన ట్రోల్స్ నడిచాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మహేశ్ కున్న సుడి వీరలెవల్లో వర్కవుట్ అయ్యింది. ఎందుకంటే.. మహర్షి సినిమా మే 9న రిలీజ్ అవుతుంది. మే 9 తర్వాత మహేశ్ మహర్షి సినిమాకు పోటీగా ఒక్కటంటే ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. చిన్నా చితకా సినిమాలు ఉన్నా వాటిని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరనే విషయం అందరికి తెలిసిందే. దీంతో.. ఓ మాదిరి టాక్ వచ్చినా మహర్షి సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు రావడం పక్కా.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...