ఓరేయ్.. అంటూ డైరెక్టర్ చెంప పగలకొట్టిందట!

Actor-Raksha-Slaps-Director-Andhra-Talkies
తెలుగు.. తమిళ.. కన్నడ.. మలయాళ చిత్ర కథానాయికగా దాదాపు 30 సినిమాల్లో నటించారు రాణి అలియాస్ రక్ష. కనుసైగతో కుర్రకారు కుదేలైపోయేలా చేసిన ఆమె నచ్చావులే చిత్రంలో అమ్మగా రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఆమె.. తాజాగా ఒక ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగ ఆమె సంచలన అంశాల్ని వెల్లడించారు. తన పట్ల అనుచితంగా ప్రవర్తించే వారికి ఎదురుదెబ్బలు తప్పలేదన్న విషయాన్ని చెప్పిన ఆమె.. ఒక దర్శకుడిని అందరి ఎదుట తిట్టటమే కాదు.. చెంప ఛెళ్లుమనిపించిన వైనాన్ని వెల్లడించారు.

ఇంతకీ అసలేం జరిగిందో చెబుతూ.. ఆ దర్శకుడితో ఒక సినిమా చేశా.. తర్వాత ఆయన్ను కలిసింది లేదు. తమిళంలో ఒక కథ చెప్పారు. గ్లామర్ పాత్ర చేయటం లేదని.. పెళ్లి అయ్యిందని చెప్పా. పాప కూడా ఉందని.. స్లీవ్ లెస్ డ్రెస్ లు  వేసుకోనని చెప్పా. మంచిపాత్ర అని చెప్పి ఒప్పించారు.షూటింగ్ కి వెళితే అక్కడ పరిస్థితి మరోలా ఉంది. ద్వంద్వార్థాలు వచ్చేలా పొగడటం మొదలెట్టారు. మా ఆయన్ని చూపించి.. ఆయన మీ భర్తా అని అడగటం మొదలెట్టారు. కథ చెప్పటానికి వచ్చినప్పుడే.. మా ఆయన్ని పరిచయం చేశా.. షూటింగ్ స్పాట్ లో కూడా పరిచయం చేశా.. అయినా కూడా పదే పదే రకంగా విసిగించేవారు.

దీంతో కోపం వచ్చి.. ఒరేయ్ ఇలా రారా అని పిలిచి చెంప మీద లాగి పెట్టి కొట్టా.. చెప్పు తెగుతుంది.. నీకు అన్నీ చెప్పి వచ్చా.. అప్పుడు సరేనని.. ఇక్కడకు తీసుకొచ్చి పిచ్చి పిచ్చి పనులు చేయమంటావేంటిరా.. ఏమనుకున్నావు నన్ను.. నేనీ సినిమా చేయను.. నాకు అవసరం లేదని చెప్పా.

వాస్తవానికి ఆ దర్శకుడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకున్నా. కానీ.. ఆ సినిమా హీరో వచ్చి.. మేడమ్ మీరు ఫిర్యాదు చేస్తే..  సినిమా ఆగుతుంది.. దీన్ని ఇక్కడితో వదిలేయండని అడగటంతో పోనీలే.. అని వదిలేశానని చెప్పారు. అలా పిచ్చి వేషాలు వేసినదర్శకుడి చెంప ఛెళ్లుమనిపించేందుకు సైతం వెనుకాడని వైనాన్ని చెప్పుకొచ్చారు రక్ష.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...