ఎంపీగా గెలిచిన హాట్ హాట్ హీరోయిన్

Former-actress-Navneet-Kaur-Rana-defeats-Shiv-Sena-veteran-Anandrao-Adsul-Andhra-Talkies
తనదైన అందం చందంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన కథానాయిక నవనీత్ కౌర్. `శీను వాసంతి లక్ష్మీ` చిత్రంతో టాలీవుడ్ లో ప్రవేశించిన ఈ పంజాబీ బ్యూటీ అటుపై అగ్ర హీరోలు సహా పలువురు యువహీరోల సరసన నటించింది.  శీను వాసంతి లక్ష్మీ.. శత్రువు.. మహారధి తదితర చిత్రాల్లో నటించింది.  గ్లామరస్ నాయికగా ఐదారేళ్ల పాటు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. అయితే ఆశించిన స్థాయి విజయాలు దక్కకపోవడంతో కెరీర్ పరంగా వెనకబడింది. ఆ క్రమంలోనే కొన్ని ఐటెమ్ నంబర్లలోనూ నర్తించి యూత్ ని ఆకట్టుకుంది.

ఇక సినీపరిశ్రమను విడిచిపెట్టాక స్వస్థలం మహారాష్ట్ర లోనే నవనీత్ సెటిలైంది. అక్కడే రవిరాణా అనే ఎమ్మెల్యేని పెళ్లి చేసుకుని లైఫ్ లో స్థిరపడింది. రవిరాణా స్వాభిమాన్ పార్టీ తరపున తొలి నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో నవనీత్ తన భర్త అడుగు జాడల్లోనే రాజకీయారంగేట్రం చేసింది. లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర లోని అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి శివసేన పార్టీ అభ్యర్థిపై దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. నవనీత్ కి 5లక్షల 10 వేల ఓట్లు పోలయ్యాయి.నవనీత్ కౌర్ భర్త రవిరాణాకు అమరావతి సహా స్థానికంగా మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అలాగే అతడు మరెవరో కాదు .. బాబా రామ్ దేవ్ కి స్వయానా మేనల్లుడు. తన ఇలాకాలో అతడి హవా ప్రస్తుతం సాగుతోంది. నవనీత్ కి ఆరంభమే ప్రజలు పట్టంగట్టారు. కర్నాటకలో రమ్య తరహాలోనే అత్యంత పిన్న వయసులోనే ఎంపీ గా గుర్తింపు తెచ్చుకున్న అందాల కథానాయికగా వెలిగిపోతోంది ఈ భామ. గెలిచిన ఆనందంలో ఎంతో ఎమోషన్ అయిన నవనీత్ కౌర్ ని పార్టీ కార్యకర్తలు ఓదారుస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...