కంగన మెంటల్ టార్చర్ భరించలేకపోతున్న హృతిక్ రోషన్!

Hrithik-Roshan-unable-to-bear-Kangana-Mental-Torture-Andhra-Talkies
క్వీన్ కంగన రనౌత్ .. హృతిక్ రోషన్ మధ్య వివాదం గురించి తెలిసిందే. క్రిష్ 3 సమయం నుంచి ఆ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ వివాదంలోకి హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ని కంగన లాగడంతో అతడు ఈ భామపై భగ్గుమన్నాడు. అప్పట్లో కోర్టుల వరకూ వెళ్లింది ఈ గొడవ. కంగన తన సిస్టర్ రంగోలి సాయంతో హృతిక్ అండ్ గ్యాంగ్ పై ప్రతిసారీ మాటల యుద్ధం చేస్తోంది. వీలున్న ప్రతి వేదికపైనా పురుషాధిక్య ప్రపంచాన్ని అలానే హృతిక్ ని కలిపి గంపగుత్తగా తిట్టేస్తోంది కంగన. అయితే ఈ ఎపిసోడ్స్ వల్ల హృతిక్ తీవ్రంగా మనస్థాపానికి గురవుతూనే ఉన్నారు. ఒక రకంగా మహిళా ప్రపంచంపై సింపథీని కంగన తెలివిగా క్యాష్ చేసుకుంటూ తన శత్రువుల్ని చీల్చి చెండాడుతోంది. తనని కెరీర్ ఆరంభంలో ఆడుకున్న ఈ మగ ప్రపంచాన్ని తూట్లు పొడిచే ఏ అవకాశాన్ని కంగన అస్సలు వదులుకోవడం లేదు.ఇప్పటికే పలు వేదికలపై  హృతిక్ ని మాటలతోనే టార్చర్ పెట్టిన క్వీన్ .. ఇప్పుడు ప్రొఫెషనల్ గానూ అవాంచిత యుద్ధం ప్రారంభించింది. ఇటీవలే హృతిక్ నటించిన సూపర్ 30 రిలీజ్ తేదీని టీమ్ ప్రకటించింది. జూలై 26 న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. సరిగ్గా అదే సమయంలో కంగన నటించిన `మెంటల్ హై క్యా` చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ఏక్తా కపూర్ ప్రకటించడం సంచలనమైంది. ఆ క్రమంలోనే కంగన అసలు గేమ్ స్టార్ట్ చేసింది. హృతిక్ ని టీజ్ చేస్తూ మా సినిమా రిలీజవుతోంది. హృతిక్ తన సినిమాని వాయిదా వేసుకోవడం గ్యారెంటీ అంటూ ఆట పట్టించింది.

ఆ వ్యాఖ్యను అంతే సీరియస్ గా తీసుకున్న హృతిక్ ఈ మెంటల్ టార్చర్ ని భరించలేను. మీడియాకి ఆహారంగా మారుతున్నాను. ఎందుకీ పిచ్చి గోల!! అంటూ సూపర్ 30 సినిమాకి కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం సంచలనమైంది. కంగన వల్ల తాను ఎంత మనోవేదన అనుభవిస్తున్నది హృతిక్ ఒక సుదీర్ఘ మైన నోట్ ద్వారా వ్యక్తం చేసిన తీరు ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. విషపూరిత మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నా! నన్ను నేను కాపాడుకునేందుకు రిలీజ్ తేదీని మార్చమని నిర్మాతల్ని అభ్యర్థిస్తున్నా.. అంటూ హృతిక్ ఎంతో మనోవేదనను కనబరచడం ఆయన అభిమానుల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ సన్నివేశంలో సూపర్ 30 రిలీజ్ తేదీని మార్చినా కంగన అతడిని విడిచిపెడుతుందా?  లేక అతడిని వెంటాడి వేధిస్తుందా? అంటూ అభిమానుల్లో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక మెంటల్ హైక్యా రిలీజ్ తేదీని ప్రకటించి అందుకు కట్టుబడి ఉన్న ఏక్తా కపూర్ ని అభినందిస్తున్నాను. ఈ పురుషాధిక్య ప్రపంచానికి ఎదురెళుతున్న తనని మెచ్చుకుని తీరతాను.. అంటూ కంగన వ్యాఖ్యానించడం.. హృతిక్ లో మరింత మంట పుట్టించి ఉంటుందనడంలో సందేహమే లేదు. ఇంతకీ ఈ వార్ కి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా.. లేక మునుముందు పెను యుద్ధంగా మారుతందా? అన్నది వేచి చూడాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...