విడాకులకు సిద్దమైన మరో స్టార్ కపుల్

Imran-Khan-And-Avantika-Divorce-After-8-Years-Of-Marriage-Andhra-Talkies
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కెరీర్ పరంగా చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నాడు. హీరోగా ఇమ్రాన్ ఖాన్ కెరీర్ ఆరంభంలో ఆకట్టుకున్నాడు. కాని ఆ తర్వాత మెల్ల మెల్లగా అతడు హీరోగా ఫ్లాప్ అవుతూ వచ్చాడు. ఒకానొక దశలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ప్రయత్నాలు చేశాడు. కాని అలా కూడా అతడు సఫలం కాలేదు అతడికి ఆఫర్లు దక్కలేదు. దాంతో నటనను పక్కన పెట్టి డైరెక్షన్ కూడా ప్రయత్నించాడు. ఒక వైపు సినీ కెరీర్ ఏమాత్రం ఆశాజనకంగా లేని ఈ సమయంలో మరో వైపు వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తలెత్తాయి.ఇమ్రాన్ ఖాన్ మరియు అవంతికలు ఎనిమిది సంవత్సరాలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ పెళ్లి గురించి అప్పట్లో బాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరి పెళ్లి తర్వాత సంతోషకర జీవితాన్ని గడిపారు. వీరికి 2014లో ఒక పాప కూడా పుట్టింది. వీరి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా వీరిద్దరి మద్య విభేదాలు చిన్న చిన్నగా మొదలై పెద్దగా అయ్యాయి. ప్రస్తుతం ఇద్దరు కూడా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

సినిమాల్లో ఫెయిల్ అవుతూ వస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆ టెన్షన్స్ ను అవంతికపై చూపడం వల్ల ఇద్దరి మద్య గ్యాప్ వచ్చినట్లుగా బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. వీరిద్దరి మద్య రాజీ కుదిర్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అమీర్ ఖాన్ కూడా ఇమ్రాన్ ఖాన్ మరియు అవంతికతో మాట్లాడేందుకు ప్రయత్నించాడట. కాని వారిద్దరు మాత్రం కలిసి ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. గత కొన్ని వారాలుగా ఇమ్రాన్ ఖాన్ మరియు అవంతికలు విడి విడిగానే ఉంటున్నారు. త్వరలోనే వీరిద్దరు ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరకాస్తు చేసే అవకాశాలున్నాయని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...