మోదీ బయోపిక్ తెలుగు రాష్ట్రాల్లో రాదా?

Indian-PM-Narendra-Modi-Biopic-in-Telugu-Andhra-Talkies
బయోపిక్ ల ట్రెండ్ లో రాజకీయ నాయకుల బయోపిక్ లు జోరుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్.. వైయస్సార్.. థాక్రే .. మన్మోహన్ సింగ్ బయోపిక్ లు తెరకెక్కి రిలీజయ్యాయి. ఇవన్నీ ఎన్నికల ముందే రిలీజయ్యాయి. అయితే ఎన్నికల సమయంలో తెరకెక్కిన `పీఎం నరేంద్ర మోదీ` బయోపిక్ మాత్రం రిలీజ్ కాలేదు. ఈసీ ఆంక్షలతో ఎట్టకేలకు ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఈ సినిమా రిలీజైంది.

రిలీజైంది .. సరే.. ఈ చిత్రాన్ని మొత్తం 23 భాషల్లో రిలీజ్ చేస్తున్నామని తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు వెర్షన్ రిలీజవుతుందని ప్రకటించారు. అయితే మోదీ బయోపిక్ తెలుగు వెర్షన్ కి సంబంధించిన సరైన సమాచారం ఏదీ లేదు ఇంతవరకూ. ఇంతకీ ఇది తెలుగు రాష్ట్రాల్లో రిలీజవుతుందా లేదా? అన్నది తెలియాల్సి ఉందింకా.మరోవైపు దేశవ్యాప్తంగా హిందీ వెర్షన్ మాత్రం రిలీజైంది. వివేక్ ఒబేరాయ్ టైటిల్ పాత్ర పోషించిన `పీఎం నరేంద్ర మోదీ` చిత్రం తొలి రోజు చక్కని వసూళ్లు సాధించింది. నరేంద్ర మోదీకి ఉన్న కరిష్మా దృష్ట్యా.. అలానే గెలిచి మరోసారి ప్రధానిగా పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న ఊపులో జనం థియేటర్ల వద్ద క్యూలు కట్టారని తెలుస్తోంది. మొత్తానికి డే1 ఈ సినిమా 2.5 కోట్ల మేర నెట్ వసూలు చేసిందని తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు అదే రోజు ప్రతిష్ఠాత్మకంగా రిలీజయ్యాయి. విల్ స్మిత్ నటించిన హాలీవుడ్ గ్రాఫికల్ వండర్ `అల్లాడిన్` అదే రోజు రిలీజై తొలి రోజు 4.25కోట్లు వసూలు చేసింది. మరోవైపు యువహీరో అర్జున్ కపూర్ నటించిన `ఇండియాస్ మోస్ట్ వాంటెడ్`  చిత్రం క్రిటిక్స్ ప్రశంసలు అందుకుని 2కోట్లు వసూలు చేసింది. వీటితో పాటు అజయ్ దేవగన్ `దే దే ప్యార్ దే` మాస్ లో వెళుతోంది. ఇంత పోటీ నడుమ పీఎం మోదీ చిత్రాన్ని జనం థియేటర్లకు వెళ్లి చూడడం ఆసక్తి రేకెత్తించేదని విశ్లేషిస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...