నేను పిలిస్తే కాజల్ కాదనదు: ప్రముఖ డైరెక్టర్

She-Don-t-Say-No-When-I-Call-Her-Says-Director-Teja-Andhra-Talkies
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత అందం అభినయంతో ఆకట్టుకుని బడా హీరోల సరసన ఎన్నో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోలుగా వెలుగొందుతున్న అందరితో కాజల్ నటించింది. చేతి నిండా సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. కథల ఎంపిక విషయంలోనూ ఆమె తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఈ మధ్య సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటోంది. తాజాగా ఆమె ‘సీత’ అనే సినిమాలో నటిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను తేజ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా మే 24న విడుదల కాబోతుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. దీనికి విశేష స్పందన వస్తోంది. ఈ సినిమా విడుదలకు ఎంతో సమయం లేకపోవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే డైరెక్టర్ తేజ తాజాగా ఓ చానెల్ తో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కాజల్ గురించి ఆయన కొన్ని విషయాలను వెల్లడించారు. ‘‘కాజల్ అందిరిలాంటి హీరోయిన్ కాదు. ప్రస్తుత తరంలో సక్సెస్ ఉన్న డైరెక్టర్ దగ్గరే పరుగులు తీస్తుంటారు చాలా మంది. కానీ కాజల్ కు మాత్రం అలాంటివి పట్టవు. తనకు పాత్ర నచ్చితే ఎవరితోనైనా చేస్తుంది. ముఖ్యంగా నేను అడిగితే ఆమె తప్పకుండా చేస్తుంది. ‘‘నేనే రాజు నేనే మంత్రి’’ సినిమానే దీనికి చక్కని ఉదాహరణ. అందులో ఆమె పాత్ర ఎంత హైలైట్ అయిందో అందరికీ తెలుసు.

 అంతకు ముందు నాకు ఫ్లాఫ్ సినిమాలు ఉన్నా అడగ్గానే ఓకే చేసేసింది. మా ఇద్దరి మధ్య అంతటి అనుబంధం ఉంది. సినిమా విషయంలో నేను పిలిస్తే కాజల్ ఎప్పటికీ కాదనదు. అందుకే ఆమెపై నాకు అంత నమ్మకం’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా.. ఈ సినిమాలో కొత్త రకం కాజల్ ను చూస్తారని చెప్పిన ఆయన.. బెల్లంకొండ శ్రీనివాస్ ఎంతో పరిణితితో నటించాడని తెలిపారు. సోనూసూద్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. శిర్షా రే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...