సూపర్ స్టార్ మహేశ్ బాబు సుడి మామూలుగా లేదు

Super-Star-Mahesh-babu-Confident-on-Maharshi-Movie-Andhra-Talkies
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని మహేశ్ నటించిన సినిమా మహర్షి. దీంతో.. ఈ మూవీతో కూడా బంపర్ హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు మహేశ్. మహర్షి సినిమా కోసం మహేశ్ బాగానే కష్టపడ్డాడు. అయితే.. ఎంత కష్టపడినా సినిమాకు మాత్రం అస్సలు హైప్ రాలేదు. ఎంత ప్రమోషన్ చేసినా - టీవీల్లో ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా అందరూ అవెంజర్స్ గురించి మాట్లాడుతున్నారు తప్ప మహర్షి గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడడం లేదు.

మహర్షి సినిమా ట్రైలర్ ఆడియన్స్ కి మరీ ముఖ్యంగా అభిమానులకు అస్సలు నచ్చలేదు. అయితే.. సినిమా ఎలా ఉన్నా సరే.. రిలీజ్ కు ముందే తన మ్యూజిక్ తో మంచి హైప్ తెచ్చే దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈసారి మహేశ్ కు హ్యాండ్ ఇచ్చినట్లే కన్పిస్తుంది. ఒక్కటంటే ఒక్క పాట కూడా సూపర్ హిట్ అవ్వలేదు సరికదా.. అసలు ఇవి మహేశ్ సినిమాలో పాటలేనా అన్పించేంతగా చిరాకు పుట్టిచ్చాయి. మహర్షి ఆడియోపై సోషల్ మీడియాలో కూడా బీభత్సమైన ట్రోల్స్ నడిచాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మహేశ్ కున్న సుడి వీరలెవల్లో వర్కవుట్ అయ్యింది. ఎందుకంటే.. మహర్షి సినిమా మే 9న రిలీజ్ అవుతుంది. మే 9 తర్వాత మహేశ్ మహర్షి సినిమాకు పోటీగా ఒక్కటంటే ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. చిన్నా చితకా సినిమాలు ఉన్నా వాటిని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరనే విషయం అందరికి తెలిసిందే. దీంతో.. ఓ మాదిరి టాక్ వచ్చినా మహర్షి సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు రావడం పక్కా.మరోవైపు ఐపీఎల్ కూడా ఎండ్ కు వచ్చేసింది. ఆ తర్వాత వరల్డ్ కప్ టోర్నమెంట్ ఉన్నా దానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఈలోపు సమ్మర్ హాలిడేస్ లో కలెక్షన్లు కుమ్మేసుకోవచ్చు. ఎలా చూసుకున్నా దాదాపు నెలరోజుల పాటు మహేశ్ మహర్షి సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవు. అందుకోసమే మహేశ్ మహర్షి సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక అన్నింటికి మించి ఈ సినిమాకు ముగ్గురు నిర్మాతలు ఉండడండతో.. థియేటర్లకు కూడా వచ్చిన ప్లాబ్లమ్ ఏం ఉండదు. జనాలు వచ్చినంతకాలం నిర్మాతలకు నచ్చినంత కాలం థియేటర్లో సినిమాను ఆడించుకోవచ్చు. దీంతో.. మహర్షి సినిమా తన కెరీర్లో మరో హిట్ అని అప్పుడే పార్టీలు చేసుకుంటున్నాడు మహేశ్.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...