క్రేజీ టీజర్..నగ్నంగా నటించిన సౌత్ హీరోయిన్!

Aame-Teaser-Andhra-Talkies
సౌత్ లో ఉన్న హాట్ హీరోయిన్లలో అమలా పాల్ ఒకరు.  బోల్డ్ గా ఉండడం.. ఘాటుగా నటించడం.. వివాదాలలో చిక్కుకోవడం ఆమెకు కొత్త కాదు.  తాజాగా అమలా పాల్ తన కొత్త సినిమా 'ఆమె' టీజర్ తో మరోసారి సంచలనం సృష్టించింది.  ఈ సినిమా టీజర్ ను ఈరోజు సాయంత్రం బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ విడుదల చేశారు.

టీజర్ ఓపెన్ చెయ్యగానే ఒక  అమ్మతో పోలీస్ "ఇంకో రోజు వెతికి ఉండాల్సింది కదా?  మీ అమ్మాయి కనిపించడం లేదు.. నువ్వు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వచ్చేయడమేనా? ఆసలు అమ్మయికోసం వెతికారా?" అని అడుగుతాడు. దీనికి సమాధానంగా ఆవిడ "అమ్మాయితో నేను చివరిసారిగా ఫోన్ లో  మాట్లాడినపుడు అమ్మాయి మద్యం మత్తులో ఉంది" అని సమాధానం చెప్తుంది.  ఈ సీన్ తర్వాత సస్పెన్స్ పెంచుతూ స్లోగా..  ఖాళీగా ఉండే ఒక పెద్ద బిల్డింగ్ లో చూపిస్తారు.  అక్కడ ఒకరు రక్తపు మడుగులో పడి ఉంటారు.  నెక్స్ట్ సీన్ లో నగ్నంగా ఉన్న అమలా పాల్ ను చూపిస్తారు.సోషల్ మీడియాలో.. వెబ్ సీరీస్ లో నగ్నత్వం కామన్ అయిపోయింది కానీ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో మాత్రం సంచలనమే. ఎంత కళాత్మకంగా డిఫరెంట్ యాంగిల్స్ లో అసభ్యత  లేకుండా చూపించినా అమలా పాల్ ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురిచేసినట్టే.  బాలీవుడ్ లో రాధిక ఆప్టే లాంటివారు గతంలో ఇలాంటివి చేశారు కానీ సౌత్ లో మాత్రం ఇది కొత్త ట్రెండ్.  ఇప్పటికే ఈ టీజర్ వైరల్ అయింది. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.  ఈ చిత్రానికి దర్శకుడు రత్నకుమార్.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...