మరో నటి మిస్సింగ్ కలకలం

Actress-missing--plaint-lodged-by-SR-Nagar-police-Andhra-Talkies
అనంతపురం జిల్లా ధర్మవరం యువతి.. టీవీ నటి లలిత అదృశ్యం వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను తీసుకెళ్లారని అమీర్ పేట హాస్టల్ యాజమాన్యం చెప్పడంతో లలిత తల్లి దండ్రులు తమ కూతురు మిస్సయ్యిందని కేసు నమోదు చేయడంతో ఆ వార్త దావానలంలా వ్యాపించింది. ప్రస్తుతం ఈ కేసుపై ఎస్.ఆర్.నగర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే అమీర్ పేట- ఎస్.ఆర్.నగర్ హాస్టల్స్ లో ఇలాంటి మిస్సింగ్ కేసులు మరిన్ని ఉన్నాయని తాజా ఉదంతం చెబుతోంది.

తాజాగా మరో మిస్సింగ్ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో.. వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా ప్రచారం సాగుతోంది. సినిమా ఛాన్స్ వచ్చిందని ఇంట్లో నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఖ్యాతి సుమ అనే యువతి మిస్సయ్యిందంటూ నేడు ఓ టీవీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వాట్సాప్ లో సాగిన ప్రచారం కలకలం రేపింది. సుమ వయసు 22. ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్ కి నటిగా అవకాశాలు వెతుక్కుంటూ విచ్చేసింది. ఆమె ఫోన్.నం.9121922374 కూడా వాట్సాప్ గ్రూపుల్లో దర్శనమిస్తోంది. ఈ కేసు కూడా ధర్మవరం లలిత తరహాలోనే సస్పెన్స్ లో ఉందని అర్థమవుతోంది. ప్రస్తుతం ఆ నోటా ఈనోటా సుమ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించిన వార్త వినిపిస్తుండడం కలకలం రేపుతోంది. సుమ ప్రస్తుతం ఏఏ సినిమాలు.. సీరియల్స్ చేస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఇక వాట్సాప్ లో ఇచ్చిన నంబర్ కి కాల్ చేస్తుంటే రింగ్ అవుతున్నా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.


అయితే తెలుగు సినీ-టీవీ పరిశ్రమ నుంచి ఇలాంటి మిస్సింగ్ కేసుల విషయంలో జాగ్రత్తలు తీసుకుని అలెర్ట్ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నటీమణులు వేధింపులపై కాష్ కమిటీని నియమించారు పెద్దలు. కానీ కాష్ కమిటీ ఏం చేస్తోందో తెలీదు. అలాగే మంచు లక్ష్మీ ప్రసన్న- నందినిరెడ్డి- సమంత- ఝాన్సీ బృందం సైతం ప్రత్యేకించి మహిళల వేధింపుల వ్యవహారంపై ఉద్యమం నడిపిస్తున్నారు. అయితే ఇలాంటి మిస్సింగ్ కేసుల్ని నివారించేందుకు ఎవరూ ఏమీ చేయరా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...