ఆమె పోస్ట్ చూస్తే.. దే దే ప్యార్ దే సినిమా గుర్తుకొస్తుంది!

Ankita-Konwar-account-of-how-she-met-the-love-of-her-life-Milind-Soman-Andhra-Talkies
ప్రేమకు వయసుకు సంబంధం లేదంటారు కానీ.. అదేమంత చిన్న విషయం కాదు.  ఈ మధ్యన విడుదలైన దే దే ప్యార్ దే సినిమా చూశారా? అజయ్ దేవగన్.. మన రకుల్.. టబూ నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యింది. తన కూతురు వయసున్న అమ్మాయితో ప్రేమలో పడిన వ్యక్తిగా అజయ్ దేవగణ్ నటించారు. ఈ సినిమా చూస్తే.. ఇవాల్టి రోజుల్లో ఇలాంటివి సినిమాల్లోనే కానీ రియల్ గా కాదన్న మాట వినిపిస్తుంది.

అయితే.. తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీ మిలింద్ సోమన్ పెళ్లి వ్యవహారం చూస్తే.. ఇది తప్పనిపిస్తుంది. తన కంటే 26 ఏళ్లు చిన్నదైన అంకితా కొన్వార్ ను పెళ్లాడిన మిలింద్ సోమన్ ను పలువురు విమర్శలు చేయటమే కాదు.. నెటిజన్లు ట్రోల్ చేశారు. అయితే.. పెళ్లికి ప్రేమకు వయసుతో సంబంధం లేదన్న విషయాన్ని అంకితా తన తాజా పోస్ట్ తో ప్రస్తావించింది. తమ పెళ్లి జరిగిన వైనాన్ని ప్రస్తావిస్తూ ఆమె పెట్టిన డిటైల్డ్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.వారిద్దరి పెళ్లిని వ్యతిరేకించిన వారు సైతం.. ఆమె పోస్ట్ చదివాక ఒక సానుకూల దృక్ఫదం ఏర్పడటమే  కాదు.. ఆల్ ద బెస్ట్ అన్న మాట చెప్పాలనిపించేలా ఉండటం విశేషం. తన ప్రేమ.. పెళ్లి విషయంలో తనకు ఎదురైన అవాంతరాల గురించి హ్యుమన్స్ బాంబే ఫేస్ బుక్ పేజీలో ఆమె పెట్టిన పోస్టును తెలుగులో చెప్పుకొస్తే..

నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి మరణించాడు. దీంతో దేశం విడిచి వెళ్లిపోవాలని అనుకున్నాం. మలేషియాలో ఎయిర్ ఏషియా క్యాబిన్ క్రూ మెంబర్ గా పని చేస్తున్నా. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి చనిపోయిన తర్వాత నా గుండె పగిలిపోయింది. ఆ గాయం ఎప్పటికి మానదని అనుకున్నా.

కొన్ని నెలల తర్వాత చెన్నైకి వచ్చిన నాకు మిలింద్ తో పరిచయం ఏర్పడింది. చెన్నైలో కోలీగ్స్ తో కలిసి హోటల్లో ఉండేదాన్ని. ఓ రోజు లాబీలో మిలింద్ ను చూశాను. తనంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు నేనో పెద్ద ఫ్యాన్. అందుకే వెళ్లి పలుకరించా. కానీ ఆయన బిజీగా ఉన్నాడు. తనతో డ్యాన్స్ చేయాలనుకున్నా కానీ కుదర్లేదు.

కొన్ని రోజల తర్వాత అతడు నన్ను మర్చిపోయాడనిపించింది. అయితే అది తప్పని నిరూపించాడు. నా ఫోన్ నెంబర్ మర్చిపోయానని చెప్పటంతో ఫ్రెండ్ నెంబర్ తీసుకొని మెసేజ్ చేయమని చెప్పాడు. అలా మొదలైన పరిచయం.. పెద్దదైంది. తనకు నా గతం గురించి చెప్పా.

నీతో ప్రేమలో పడినప్పుడే నీకు సంబంధించిన అన్ని విషయాల్లో తోడుగా ఉండాలని డిసైడ్ అయ్యా. దాని గురించి భయపడొద్దన్నాడు. ఆ క్షణం నుంచి అతన్ని నా వాడిగా అనుకోవటం మొదలెట్టా. ఐదేళ్లు డేటింగ్ చేశాక తనని పెళ్లి చేసుకున్నా. మా ఇద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం కారణంగా కుటుంబ సభ్యులు.. స్నేహితులు మా పెళ్లిని వ్యతిరేకించారు. కానీ.. తన గురించి పూర్తిగా తెలిసిన తర్వాత వ్యతిరేకించిన వాళ్లే దగ్గరుండి పెళ్లి చేశారు.

మీరు నమ్ముతారో లేదో.. మేం మూడుసార్లు పెళ్లి చేసుకున్నాం. నా జీవితంలో జరిగిన అత్యంత మంచి విషయం అతనితో నా పెళ్లి జరగటం.. తనతో జీవితకాలపు ప్రయాణాన్ని కొనసాగించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...