ఆ ముగ్గురు స్టార్ల వల్ల కానిది ప్రభాస్ చేస్తాడా?

Bahubali-Hero-Prabhas-Lends-Own-Voice-in-Saaho-Teaser-For-Hindi-Version-Andhra-Talkies
ఇవాళ విడుదలైన సాహో టీజర్ మీద అటు బాలీవుడ్ లోనూ ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ అంటూ నార్త్ ప్రేక్షకులు సైతం ముక్తకంఠంతో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హిందీ వెర్షన్ టీజర్ లో ప్రభాస్ స్వయంగా డబ్బింగ్ చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. కేవలం ఇది టీజర్ కే పరిమితమా లేక సినిమా మొత్తం స్వంతంగా గొంతు అరువిస్తాడా అనేది ఇప్పుడు చర్చకు వస్తోంది.

హింది స్ట్రెయిట్ మూవీస్ మన స్టార్లు చేయడం కొత్తేమి కాదు. చిరంజీవి 3 వెంకటేష్ 2 నాగార్జున 6 చొప్పున నటించారు. కాని ఈ ముగ్గురు ఏనాడూ స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోలేదు. వేరే వాళ్ళు గాత్రం ఇచ్చారు. రామ్ చరణ్ జంజీర్ లో కూడా ఇదే రిపీట్ అయ్యింది. నేటివిటీ కారణంగా హింది పదాలు పలికేటప్పుడు స్లాంగ్ లో వచ్చే తప్పులు ఇబ్బంది పెడతాయనే ఉద్దేశంతో డబ్బింగ్ చెప్పే సాహసం చేయలేదుఇప్పుడు ప్రభాస్ ఈ ట్రెండ్ ని బ్రేక్ చేస్తాడా అనేది వేచి చూడాలి. టీజర్ లో ఉన్నది చిన్న చిన్న మాటలు కాబట్టి కవరైపోయాయి కాని మొత్తం సినిమా అంటే వ్యవహారం ఇలా ఉండదు. కాని విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో డార్లింగ్ ఓన్ వాయిసే వినిపిస్తుందట. దీని కోసమే సోనీ అనే టీచర్ ప్రత్యేకంగా నియమించుకుని కోచింగ్ తీసుకున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి.

సో ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. కాని ఫైనల్ కాపీ చూసాక ఎలాంటి ఇబ్బంది లేదు అనిపిస్తే అప్పుడు నిర్ణయం తీసుకుందామని యూనిట్ ఫిక్స్ అయినట్టు తెలిసింది. సాహో నిర్మాణంలోనే కాదు ఇలాంటి చాలా విషయాల్లోనూ ఏదో ఒక టాపిక్ గా నిలుస్తూనే ఉంది.ఈ తాకిడి ఆగస్ట్ 15 దాకా తప్పేలా లేదు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...