ఆమె జీన్స్ వేసుకొని కత్రినా జంప్ అంట!

Bollywood-Heroin-Katrina-Kaif-Tells-About-Her-Personal-Life-Incidents-Andhra-Talkies
బాలీవుడ్లో ఉండే క్రేజీ బ్యూటీలలో కత్రినా కైఫ్ ఒకరు.  ఇప్పటికి ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదిహేనేళ్ళు దాటినా ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగడం ఒక గొప్ప విషయమే.  కత్రినా తర్వాత హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన చాలామంది ఇప్పుడు ఫేడ్ అవుట్ అయ్యారు. కానీ కత్రినా మాత్రం తన క్రేజ్ ను కొనసాగిస్తోంది. రీసెంట్ గా అనైతా ష్రాఫ్ అదజానియాతో కలిసి కత్రినా కైఫ్ 'బీఎఫ్ ఎఫ్స్ విత్ వోగ్- సీజన్ 3' చాట్ షో కు హాజరైంది.  నేహా ధూపియా ఈ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఈ షోలో కత్రినా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పలు విషయాలను పంచుకుంది.

'రాజ్ నీతి'..'జిందగీ న మిలేగి దొబారా' .. 'న్యూయార్క్' లాంటి సినిమాలకు పనిచేసిన సమయంలో తన ఫోకస్ చాలా ఎక్కువగా ఉండేదని.. ఎంతో హార్డ్ వర్క్ చేసేదాన్నని.. తను పోషించే  క్యారెక్టర్లను చూసే విధానం కూడా డిఫరెంట్ గా ఉండేదని తెలిపింది.  కానీ ఒక ఫేజ్ లో సినిమాలపై తన ఫోకస్ కొంత తగ్గిందని అంగీకరించింది.  ఆ సమయంలో వర్క్ కాకుండా మరో అంశం తన లైఫ్ లో నిండిపోయిందని.. ఆ రిలేషన్ షిప్ లో లైఫ్ ఎంతో సంతోషంగా ఉండేదని తెలిపింది. అయితే దాని గురించి ఇప్పుడు తానేమీ చింతించడం లేదని చెప్పుకొచ్చింది.ఇంతకీ కత్రినా ఏం చెప్పిందో అర్థం అయింది కదా? కత్రినా తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు చెప్పినా ఎవరి పేర్లు ప్రస్తావించదు.  ఆ సమయంలో రణబీర్ కపూర్ తో కత్రినా పీకల్లోతు ప్రేమలో ఉండేది. వారిద్దరి పెళ్ళి పక్కా అని అందరూ అనుకున్నారు.  కానీ దాదాపు రెండేళ్ళు డేటింగ్ చేసిన తర్వాత ఇద్దరికీ బ్రేకప్ అయింది.  ఈ సమయంలోనే కత్రినా తనకు వర్క్ పై ఫోకస్ తగ్గిందని చెప్పింది.

ఇదిలా ఉంటే.. కత్రినా గురించి అనైతా ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన చెప్పింది.  కత్రినా ఇండస్ట్రీ కి వచ్చినప్పటి నుంచి ఇద్దరూ ఫ్రెండ్స్.  అనైతా ఒక ఫ్యాషన్ డిజైనర్. దీంతో ఒకసారి ఫిట్టింగ్ కోసం అనైతాను కత్రినా తన ఇంటికి పిలిచిందట.  అనైతా డ్రెస్ కోసం వర్క్ చేస్తున్న సమయంలో కత్రినా "నీ జీన్స్ ప్యాంట్ ను విప్పు.. నాకు నీ జీన్సే నచ్చింది" అని చెప్పి ఆ ప్యాంట్ ను వేసుకొని బైటకు వెళ్ళిపోయిందట.  ఆ సమయంలో అనైతా లోదుస్తులలో మాత్రమే ఉందట!   ఈ విషయం గురించి కత్రినా మాట్లాడుతూ "అందరూ  షాప్  లో షాపింగ్ చేస్తారు నేను ఎక్కడైనా షాపింగ్ చేస్తా. మిమ్మల్ని చూస్తుంటే కూడా నేను షాపింగ్ చేస్తున్నట్టే.  అందుకే నచ్చింది అరువు తీసుకుంటా" అంటూ షాక్ ఇచ్చింది. ఇలాంటి విశేషాలు ఇంకెన్నో ఉన్న 'బీఎఫ్ఎఫ్స్ విత్ వోగ్- సీజన్ 3' కలర్స్ ఇన్ఫినిటీ ఛానెల్ లో శనివారం ప్రసారం కానుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...