ఇండియా పాక్ మ్యాచ్ లో సెలబ్స్ రచ్చ

Celebs-at-Pakistan-And-India-Match-Andhra-Talkies
వరల్డ్ కప్ ఫీవర్ అంతకంతకు రాజుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ మాంచెస్టర్ లో నేడు ఇండియా - పాక్ మ్యాచ్ కి విపరీతమైన క్రేజు నెలకొంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు పలువురు బాలీవుడ్ స్టార్లు ఎటెండ్ అయ్యారు. మ్యాచ్ కోసం మాంచెస్టర్ లో అడుగుపెట్టిన వాళ్లలో అనుష్క శర్మ.. రణవీర్ సింగ్.. సైఫ్ అలీఖాన్ .. చేసిన సందడి అంతా ఇంతా కాదు.

ఈ మ్యాచ్ లో సునీల్ గవాస్కర్- జతిన్ సప్రు లాంటి దిగ్గజాలతో కలిసి రణవీర్ సింగ్ కామెంట్రీ చెప్పాడు. రణవీర్ కి ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి. మ్యాచ్ జరగడానికి ముందే రణవీర్ స్టేడియంలో చేసిన సందడికి సంబంధించిన ఫోటోల్ని వైరల్ భయానీ ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేశారు. సినిమాల ప్రమోషన్స్ లో ఏ రేంజులో ఎనర్జీ చూపిస్తాడో అంతకుమించి చెలరేగిపోయాడు. ఈ వేదిక వద్దకు రణవీర్ కాస్తంత వింతైన గెటప్ తోనే దిగడంతో జనాల దృష్టి అటువైపు మరలింది.ఇక ఈ మ్యాచ్ వీక్షణకు పాపులర్ నటి పూజా భేడీ డాటర్ తో కలిసి సైఫ్ అలీఖాన్ విచ్చేశారు. మ్యాచ్ లో పూజా డాటర్ ఆలిఫ్ చేసిన సందడి మామూలుగా  లేదు. ఆలిఫ్ చినుగుల డెనిమ్ లో స్పెషల్ ఎంట్రీ ఇవ్వడంతో యూత్ కళ్లన్నీ అక్కడే వాలిపోయాయి. పాక్ తో మ్యాచ్ మనదే.. ఐసీసీ వరల్డ్ కప్ 2019 మనదే అంటూ ఇండియా అభిమానులు ఓవైపు స్టేడియంలో ఎంతో జోష్ చూపిస్తే.. ఆ జోష్ కి బాలీవుడ్ సెలబ్రిటీల జోష్ మరింత అదనపు ఆకర్షణగా మారుతోంది. ఇక టాలీవుడ్ నుంచి వరల్డ్ కప్ మ్యాచ్ లు వీక్షించేందుకు పలువురు హీరోలు ఇంగ్లండ్ కి వెళుతున్నారు. మొన్న ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్ కి సూపర్ స్టార్ మహేష్ కుటుంబ సమేతంగా వెళ్లిన సంగతి తెలిసిందే. మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ తో కలిసి సందడి చేశారు. మునుముందు మరింత మంది స్టార్లు మ్యాచ్ లు జరిగేప్పుడు సందడి చేయడం ఖాయం.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...