ఒకరంటే ఒకరికి ఇష్టం.. ప్రస్తుతానికి అంతే!

Hero-Vishnu-Vishal-on-his-relationship-with-Jwala-Gutta-Andhra-Talkies
ఈమధ్యే తమిళ హీరో విష్ణు విశాల్.. మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తాల మధ్య ఫ్రెండ్షిప్ కాస్త ఇంటెన్స్ గా సాగుతోందని.. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని గుసగుసలు గుప్పుమన్నాయి.  ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో ఈ గుసగుసలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి విష్ణు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటో షేర్ చేశాడు.  దీంతో కొందరు నెటిజనులు ఇదేదో ముదిరి పాకాన పడుతోందని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

ఇదే విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో విష్ణు విశాల్ ను ప్రశ్నిస్తే సగం క్లారిటీ ఇస్తూ సగం కన్ఫ్యూజన్ లో ఉంచుతూ ఆన్సర్ ఇచ్చాడు.  "ఒకరంటే ఒకరికి దాదాపుగా ఏడాది నుంచి తెలుసు.  మాకు చాలామంది కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందుకే ఫ్రెండ్స్ త కలిసి సమయం గడుపుతూ ఉంటాం" అన్నాడు.  మరి ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారుగా అని డైరెక్ట్ గా ప్రశ్నిస్తే "వ్యక్తులుగా ఒకరంటే ఒకరికి ఇష్టం. అంతకు మించి ఈ సమయంలో ఇంతకంటే నేనేం కామెంట్ చెయ్యలేను. ఇద్దరికీ ఇష్టమే కానీ ఎవరి ప్రొఫెషనల్ కమిట్మెంట్స్  వారికి ఉన్నాయి.. అందుకే రిలేషన్ షిప్ గురించి ఆలోచించడం లేదు" అన్నాడు.విష్ణు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇద్దరూ పర్మనెంట్ రిలేషన్ గురించి సీరియస్ గా అలోచిస్తున్నట్టే.  గుత్తా జ్వాల 2005 లో మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ ను వివాహం చేసుకుంది.  కానీ వైవాహిక జీవితంలో విభేదాల కారణంగా 2011 లో ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు జ్వాల సింగిల్. మరోవైపు విష్ణు విశాల్ 2011 లో రజని అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు.. ఇద్దరికీ ఆర్యన్ అనే రెండేళ్ళ బాబు కూడా ఉన్నాడు. కానీ 2018 లో విష్ణు తన భార్య నుండి విడాకులు తీసుకున్నాడు.  సో.. అటు జ్వాల ఇటు విష్ణు ఇద్దరూ సింగిల్ గానే ఉన్నారు.  త్వరలోనే విష్ణు - జ్వాల గుడ్ న్యూస్ చెప్పే అవకాశాన్ని తోసిపుచ్చలేమని కోలీవుడ్ లో టాక్.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...