సాహో ప్రభా దుమ్ము దుమారం

Latest-Poster-From-Saaho-Movie-Andhra-Talkies
టిప్పర్ లారీ ఎళ్లి స్కూటర్ ని గుద్దేస్తే ఎట్టా ఉంటది! ఎట్టా ఉండబోతోందో రేప్పొద్దున్న 11.23 కి తెలుస్తుంది. బుజ్జిగాడు ఆరోజు ఎందుకు అన్నాడో కానీ ఆ మాటకు మీనింగ్ రేపు తేల్తుంది! డార్లింగ్ ప్రభాస్ ఇంతింతై అన్న చందంగా ఎదిగేస్తున్నాడు. ఈసారి `సాహో` అంటూ దూసుకొస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత తనపై పెరిగిన అంచనాల్ని అందుకునేందుకు ప్రభాస్ ఈసారి అహోరాత్రులు కంటి మీద కునుకు అన్నదే లేకుండా శ్రమిస్తున్నాడు. ఈ భారీ యాక్షన్ చిత్రంతో ఇంటర్నేషనల్ లెవల్ మార్కెట్ ని తన ఖాతాలోకి మళ్లించే పనిలో ఉన్నాడు. ఆసక్తికరంగా సాహో లాంటి భీకరమైన యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఎంపిక చేసుకోవడంలోనే అతడి ఎత్తుగడ అర్థమైంది. ఈ సినిమాకి సరిహద్దులతో పనేలేదు. ఇది యూనివర్శల్ మార్కెట్ ని ఢీకొట్టే సినిమా అని ఇప్పటికే మేకింగ్ వీడియోలు సహా రిలీజైన పోస్టర్లు విజువల్స్ చెప్పాయి.

ఇప్పుడు ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో మరో టీజర్ ని రిలీజ్ కి సిద్ధం చేసింది యు.వి.క్రియేషన్స్ బృందం. టీజర్ రాక కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో 16 గంటల సమయం ఉండగానే ఈలోగా డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే పోస్టర్ ని రివీల్ చేశారు. ఈసారి కొత్త పోస్టర్ ని ప్రభాస్ స్వయంగా ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేయడంతో ఇది అభిమానుల్లోకి సునామీ వేగంతో దూసుకుపోతోంది.పోస్టర్ లో ప్రభాస్ లుక్ మైండ్ బ్లోయింగ్. బెనెల్లీ అల్ట్రా స్పీడ్ హైఎండ్ బైక్ పై ప్రభాస్ రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నాడు. ఇదో భారీ యాక్షన్ ఛేజ్ దృశ్యం అని అర్థమవుతోంది. ప్రభాస్ రైడింగ్ బ్యాక్ డ్రాప్ లో కార్లు గాల్లో లేచి గంతులేస్తున్నాయి. భారీ ట్రక్కులు తుక్కు తుక్కు అయిపోయాయ్. అసలు ఆ యాక్షన్ మోడ్ లో ప్రభాస్ ని చూస్తుంటే ఫ్యాన్స్ కి రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. ఇక ఈ సినిమాకి హాలీవుడ్ రికార్డ్ బ్రేకింగ్ యాక్షన్ మూవీ `ట్రాన్స్ ఫార్మర్స్` స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ నే బరిలో దించారు కాబట్టి అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. రేపటి టీజర్ చూశాక ఇంకెలాంటి ఫీలింగ్ ఉంటుందో చూడాలి. ఆగస్టు 15న సినిమా రిలీజ్ కాబట్టి అంతకుముందే మరిన్ని టీజర్లతో పాటు ట్రైలర్ - ప్రీరిలీజ్ ట్రీట్ ఉండనుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...