భర్త చూస్తుండగానే నటికి ముద్దు పెట్టిన ఫ్యాన్

Miley-Cyrus-Grabbed--Forcibly-Kissed-by-Male-Fan-While-Walking-to-Her-Car-With-Husband-Andhra-Talkies
సెలబ్రెటీల ప్రైవేట్ లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. వారు రోడ్డు మీద కనిపిస్తే చాలు జనాలు గుమ్మ గూడి ఇబ్బందికి గురి చేస్తారు. అభిమానం పేరుతో కొందరు చేసే పనికి సెలబ్రెటీలు చాలా సార్లు చిరాకు పడ్డ సందర్బాలు ఉన్నాయి. సినిమా స్టార్స్ మాత్రమే కాకుండా పాప్ సింగర్స్.. డాన్సర్స్ కూడా అభిమానుల వల్ల ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా హీరోయిన్స్ జనాల్లో దొరికితే కొందరు ఆకతాయిలు నీచంగా ప్రవర్తించేందుకు సైతం వెనకాడరు. తాజాగా అమెరికన్ పాప్ సింగర్ మిల్లీ సైరస్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు ఒక అభిమాని బాడీ గార్డ్స్ భర్త ఉండగానే ముద్దు పెట్టేశాడు.ఇటీవల స్పెయిన్ దేశానికి భర్త లియామ్ తో కలిసి షో ల కోసం వెళ్లిన మిల్లీ సైరస్ బార్సీలోనాలో ఒక కార్యక్రమంలో హాజరు అయ్యి కారు వద్దకు వస్తున్న సమయంలో ఆమెను జనాలు చుట్టు ముట్టారు. అప్పటికే ఆమెకు సెక్యూరిటీగా చాలా మంది బాడీ గార్డ్స్ ఉండటంతో పాటు.. ఆమె భర్త కూడా ఆమెకు ముందు నడుస్తున్నాడు. జనాలు ఎగబడుతున్న సమయంలో సెక్యూరిటీ వారిని చెదరగొడుతూ మిల్లీ సైరస్ ను కారు వద్దకు తీసుకు వెళ్తున్నారు. ఆ సమయంలోనే ఒక అభిమాని మిల్లీ సైరస్ ను బలవంతంగా ఆపి.. ఆమె జుట్టు పట్టుకుని ముద్దు పెట్టి క్షణాల్లో అక్కడ నుండి జారుకున్నాడు.

కొన్ని క్షణాల్లో జరిగిన ఆ సంఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయాన్ని మిల్లీ సైరస్ కాని ఆమె భర్త కాని సీరియస్ గా తీసుకోలేదు. అభిమానులు అన్నప్పుడు ఇలాంటివి చాలా కామన్ గా జరుగుతాయని వారు భావించి లైట్ తీసుకుని అక్కడ నుండి వెళ్లి పోయారు. పలు దేశాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న పాప్ సింగ్ మిల్లీ సైరస్ ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసిందని అభిమానులు అంటున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...