మన్మథుడు ముందుజాగ్రత్తలో ఉన్నాడు

Nagarjuna-Play-Safe-Game-About-Manmadhudu-2-Movie-Copyright-Issues-Andhra-Talkies
గత కొద్దిరోజులుగా మన్మథుడు 2 సినిమా అప్పుడెప్పుడో 13 ఏళ్ళ క్రితం వచ్చిన ఫ్రెంచ్ మూవీ ప్రెతె మోయితా మైను ఆధారంగా చేసుకున్నదంటూ వచ్చిన వార్తలు ఫ్యాన్స్ ని కొంత టెన్షన్ కు గురి చేశాయి. గత ఏడాది పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి టైంలో ఇలాంటి వివాదాల వల్లే త్రివిక్రమ్ అనవసరమైన అపఖ్యాతి మూటగట్టుకోవాల్సి వచ్చింది. అది నిజమో కాదో తేలేలోపే చాలా డ్యామేజ్ జరిగిపోయింది.

ఇప్పుడు తమ హీరో సినిమాకూ అదే రిపీట్ అవుతుందా అని టెన్షన్ పడ్డారు అభిమానులు. అయితే దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నుంచి కానీ నాగ్ నుంచి కానీ ఎలాంటి ఖండన రాకపోవడం అనుమానాలు ఇంకా బలపరిచింది. ఒకేవేళ స్పందించినా ఒరిజినల్ మూవీకి అనవసర ప్రచారం కలిగించి దాన్ని జనం ఆన్ లైన్ చూసేందుకు ప్రేరేపించినట్టు అవుతుంది కాబట్టి సైలెంట్ గా ఉండటమే మంచిదిఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఎవరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేకపోవడమే. విశ్వసనీయ సమాచారం మేరకు నాగ్ తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ తరఫున సదరు ఫ్రెంచ్ సినిమా హక్కులను రీజనబుల్ గా కొనేశాడట. కాకపోతే మన నేటివిటీకి తగ్గట్టు కీలకమైన మార్పులు చేయించినట్టు తెలిసింది. సో ఇది నిజమా కదా అనేది విడుదల రోజున తేలిపోతుంది కాబట్టి దేని గురించీ ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకోగా వచ్చే నెల ట్రైలర్ ను రెడీ చేస్తున్నారు. అప్పుడు మరికాస్త క్లారిటీ రావొచ్చు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...