రేణు కడుపు మండింది..అమ్మ పేరు తెచ్చి మరీ తిట్టేశారు!

Pawan-ex-wife-Renu-Desai-on-about-her-Marriage-Andhra-Talkies
సీనియర్ నటి కమ్ తరచూ వార్తల్లో ఉండే వ్యక్తుల్లో ఒకరిగా రేణు దేశాయ్ సుపరిచితురాలు. తాజాగా ఆమెకు వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. ఎప్పుడూ లేనంతగా బరస్ట్ అయిన ఆమె సంచలన వ్యాఖ్య చేశారు. తన వ్యక్తిగత ఫోటోకు ఒక వెబ్ సైట్ పెట్టిన శీర్షికతో ఆమె తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కదలించుకొని మరీ గుచ్చినట్లుగా ఉన్న సదరు శీర్షికపై ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇదే అంశాన్ని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె.. తరచూ తనకు నచ్చిన విషయాల్ని పంచుకుంటూ ఉంటారు. పిల్లలతో కలిసిన ఫోటోల్ని పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆమె కొడుకు అకీరా.. కుమార్తెతో కలిసి దిగిన ఒక ఫోటోను ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.ఆ ఫోటోకు ఒక వెబ్ సైట్ పవన్ కల్యాణ్ పిల్లలు.. ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ తో అంటూ శీర్షిక పెట్టారు. దీనిపై రేణు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా మండిపడ్డ ఆమె.. తన ఫేస్ బుక్ ఖాతాలో రెండు లైన్లలో ఊహించని రీతిలో వ్యాఖ్య చేశారు.

ఇప్పుడే ఒకరు నాకిది పంపించారు.. ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఒక తల్లికే పుట్టి ఉంటాడు. ఒక తల్లిని ఇలా బాధ పెట్టకూడదు ఎప్పుడూ అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు. నిజానికి సదరు వెబ్ సైట్ లో ఎలాంటి స్టోరీ లేదు. కేవలం ఫోటోకు రైటప్ మాత్రమే. ఆ రైటప్ మీద ఆమెకు తీవ్ర అభ్యంతరకరంగా తోచటంతో ఇంత తీవ్రంగా స్పందించి ఉంటారని చెప్పొచ్చు. ఏమైనా.. రేణు ఇంత తీవ్రంగా రియాక్ట్ కావటం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...