కోటి నుండి 20 లక్షలకు దిగజారిన క్రేజీ బ్యూటీ

Priya-Prakash-Varrier-Gets-Less-Remuneration-For-Nithin-Movie-Andhra-Talkies
ప్రియా వారియర్.. ఈ పేరు సౌత్ ఇండియాలోనే కాదు యావత్ భారత దేశంలో కూడా ఫేమస్ అయ్యింది. ఓవర్ నైట్ స్టార్ అంటే ప్రత్యక్ష సాక్ష్యంగా ప్రియా వారియర్ నిలిచింది. ఒక చిన్న సినిమాలోని పాటకు చెందిన చిన్న బిట్ అయిన ముద్దు గన్ పేల్చే సన్నివేశంతో ప్రియా వారియర్ ఒక్కసారిగా టాప్ ఆఫ్ ది ఇండియా అయ్యింది. ఆ సమయంలోనే ఈ అమ్మడితో సినిమాలు చేసేందుకు పలు భాషల నిర్మాతలు.. హీరోలు వెంట పడ్డారు. కాని ఆ సమయంలో యాడ్స్ అయితే ఒప్పుకుంది కాని ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు.

ప్రియా వారియర్ హీరోయిన్ గా నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి ఒక సినిమా అనుకున్నారు. ఆ సినిమా కోసం ప్రియా వారియర్ కు ఏకంగా కోటి పారితోషికం మాట్లాడుకుని పాతిక లక్షల అడ్వాన్స్ ను కూడా ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. అయితే ప్రియా వారియర్ తన మొదటి సినిమా విడుదలైన తర్వాతే ఏ సినిమాకైనా ఓకే చెప్తాను అంటూ చాలా సినిమాలకు నో చెప్పింది. సీన్ కట్ చేస్తే పరిస్థితి తలకిందులు అయ్యింది. లవర్స్ డే సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆ సినిమాలోని ప్రియా వారియర్ నటనకు చెత్త మార్కులు పడ్డాయి. దాంతో ఒక్కసారిగా ప్రియావారియర్ జీరో అయ్యింది.గతంలో నితిన్ మూవీకి నిర్మాత కోటి ఆఫర్ చేసిన దర్శకుడు తాజాగా 20 లక్షల పారితోషికంతో ఆమెను సినిమాలో నటింపజేస్తున్నాడు. అప్పుడు పాతిక లక్షల అడ్వాన్స్ ను కాదని.. ఇప్పుడు కేవలం 20 లక్షల పారితోషికంకు ఓకే చెప్పినట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. లవర్స్ డే సినిమా సక్సెస్ అయితే కోటికి పైగా పారితోషికం డిమాండ్ చేయాలనుకుని అప్పుడు ఆ ఆఫర్ ను కాదంది. ఆ సినిమా ఫలితం రివర్స్ అవ్వడంతో పారితోషికం మరీ దారుణంగా పడిపోయింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...