సింగిల్ గా ఉన్నా.. హ్యాపీగా ఉన్నా: శృతి

Sexy-Heroin-Shruti-Haasan-on-about-Her-Break-Up-Andhra-Talkies
స్టార్ హీరోయిన్ గా శృతి హాసన్ ఎదగడం.. కెరీర్ చక్కగా సాగుతున్న దశలో లండన్ బేస్డ్ థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలేతో ప్రేమలో పడడం.. ఆ తర్వాత తన యాక్టింగ్ కెరీర్ పై ఫోకస్ తగ్గడం అందరికీ తెలిసిందే.   సినిమాలు తగ్గించుకొని ఇంటర్నేషనల్ సింగర్ కావాలనే ధ్యేయంతో లండన్ కు మకాం మార్చింది శృతి. అయితే కొద్ది రోజుల తర్వాత మైఖేల్ తో బ్రేకప్ అయింది.  సింగర్ గా కెరీర్ కూడా ఆశించినంత గొప్పగా సాగలేదు. దీంతో ఇండియాకు వెనక్కు వచ్చి సినిమాలలో నటించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా.. హిందీలో ఒక సినిమా చేస్తోంది.

ఇదిలా ఉంటే రీసెంట్ గా శృతి తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ పై స్పందించింది.  ఇద్దరూ కూర్చుని చర్చించుకున్న తర్వాతే విడిపోదామని నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. తను సంతోషంగా ఉండడమే తనకు ముఖ్యమని.. ప్రస్తుతం సింగిల్ గా హ్యాపీగా ఉన్నానని తెలిపింది. అయితే తన బ్రేకప్ గురించి తెలిసిన స్నేహితులు మాత్రం షాక్ అయ్యారని చెప్పింది. బ్రేకప్ గురించి వేదాంత ధోరణిలో స్పందిస్తూ అన్నీ మనం అనుకున్నట్టు జరగవని చెప్పింది.శృతి తన మ్యూజిక్ ఎక్స్ టెండెడ్ ప్లే(ఆల్బం లాంటిదే) గురించి మాట్లాడుతూ.. ఇది ఒక ఆటో బయోగ్రాఫికల్ ప్రాజెక్ట్ అని పాటల సాహిత్యం విషయంలో చాలా నిజాయితీగా ఉన్నానని తెలిపింది.  మనందరికీ యూనివర్సల్ ఎమోషన్స్ ఉంటాయని .. కొన్ని ఫీలింగ్స్ కూడా ఉంటాయని.. హృదయానికి తగిలే గాయాలు.. ఆత్మవిశ్వాసం.. బలం లాంటివి అందరికీ కామన్ అని తెలిపింది. అలాంటి అంశాలపైనే తన పాటలు ఉంటాయని తెలిపింది.  బ్రేకప్ తర్వాత తన హృదయానికి కలిగిన బాధపై కూడా ఒక పాట రాసిన విషయం చెప్తూ.. ఆ పాట కూడా ఉంటుందని చెప్పింది. కమల్ కూతురా మజాకానా.. తనకు అనిపించింది చేస్తుంది. నో లౌక్యం.. నో బుల్ షిట్!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...