ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నా తప్పని తిప్పలు!

These-Actress-Are-Not-Gets-More-Offers-After-Getting-Success-Andhra-Talkies
ఇండస్ట్రీలో ఛాన్స్ రావడమే కష్టం.. ఒకవేళ వచ్చినా సక్సెస్ సాధించడం ఇంకా కష్టం. అదృష్టం కలిసొచ్చి అది కూడా జరిగినా ఆ తర్వాత ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడం చాలా కష్టం.  ఈమధ్య ఇద్దరు ముగ్గురు హీరోయిన్లకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ లిస్టులో ప్రియాంక జవాల్కర్.. రుహాని శర్మ.. పాయల్ రాజ్ పుత్ లాంటి హీరోయిన్లు చాలామంది ఉన్నారు.

విజయ్ దేవరకొండ లాస్ట్ సినిమా 'టాక్సీవాలా' సూపర్ హిట్ అయిందనే సంగతి తెలిసిందే. షూటింగ్ డిలే అయినా.. పైరసీ బారిన పడినా వాటితో సంబంధం లేదన్నట్టుగా నిర్మాతలకు.. డిస్ట్రిబ్యూటర్లకు 'టాక్సీవాలా' భారీ లాభాలు తీసుకొచ్చింది.  అయితే ఈ సినిమాలో నటించిన ప్రియాంకకు ఇప్పటివరకూ ఒక్క ఆఫర్ కూడా రాలేదు.  ఇక రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా తెరకెక్కిన 'చిలసౌ' బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించలేదు కానీ మంచి పేరు తెచ్చుకుంది.  రాహుల్ రవీంద్రన్ కు 'మన్మథుడు 2'  ఛాన్స్ రావడానికి కారణం ఆ సినిమానే.  'చిలసౌ' లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రుహాని శర్మ.  మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్ర కావడంతో గ్లామర్ కు స్కోప్ లేదు కానీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క ఛాన్సు రాలేదు.ఇదిలా ఉంటే పాయల్ రాజ్ పుత్ విషయం మరోలా ఉంది.  మొదటి సినిమా 'RX 100' తోనే సంచలనం సృష్టించింది.  ఘాటు ముద్దులు.. బోల్డ్ యాక్టింగ్ తో కుర్రకారుకు కిక్కిచ్చింది.  ఆ సినిమా చూసిన వాళ్ళు ఇక పాయల్ కు తిరుగుండదని అనుకున్నారు. అయితే ఇంతవరకూ సెకండ్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. రీసెంట్ గా 'అరుంధతి'  సీక్వెల్ లో నటిస్తోందని ప్రకటన వచ్చింది.  సినిమా ఎలా ఉంటుందన్నది ఇప్పుదే కామెంట్ పాస్ చేయడం కరెక్ట్ కాదు కానీ.. 'అరుంధతి 2' టీమ్ లో ప్రేక్షకులకు తెలిసిన ఫేస్ పాయల్ మాత్రమే. మరి అలాంటి టీమ్ 'అరుంధతి' మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ఆశించడం అత్యాశే.

ఓవరాల్ గా చూస్తే.. సక్సెస్ సాధించి గుర్తింపు తెచ్చుకున్న కొత్త హీరోయిన్లు తమ కెరీర్ ను ప్లాన్ చేసుకునే విషయంలో బోల్తా పడుతున్నారనే విషయం అర్థం అవుతోంది.  కాజల్ అగర్వాల్ లాంటి సీనియర్ల సలహాలు ఈ జూనియర్లకు ఎంతైనా అవసరమే!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...