జయలలితగా క్వీన్ కంగన రంగ ప్రవేశం

Bollywood-hot-heroin-Kangana-Ranaut-to-prep-for-Jayalalithaa-biopic-in-Manali-Andhra-Talkies
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలితపై వరుసగా బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. అయితే వీటిలో క్వీన్ కంగన నటించనున్న బయోపిక్ సెప్టెంబర్ లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఏ.ఎల్.విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తెలుగు.. తమిళ భాషల్లో తలైవి పేరుతో హిందీలో జయ పేరుతో త్రిభాషా చిత్రంగా రూపొందనుంది. `జడ్జిమెంటల్ హై క్యా` నిర్మాత ఆర్.శైలేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్- రజత్ అరోరా సంయుక్తంగా స్క్రిప్టు పనులు చేస్తున్నారు.

సెప్టెంబర్ లో సినిమా ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్న ఈ టీమ్ ఇప్పటికే కంగనకు లుక్ టెస్టులు చేసేందుకు రెడీ అవుతోంది. అందుకోసం కంగన స్వస్థలం మనాలి వెళ్లనున్నారు. అక్కడ లుక్ టెస్టులతో పాటు పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్ క్లాసులు ఉంటాయట. అలాగే కంగన ఇప్పటికే తమిళ భాషను నేర్చుకుంది. ఈ బయోపిక్ లో కంగన విభిన్నమైన గెటప్పుల్లో కనిపించాల్సి ఉంటుంది. జయలలిత యుక్తవయసులో ఉన్నప్పుడు.. కథానాయిక అయ్యాక.. నాయకురాలు అయ్యాక ఇలా రకరకాల లుక్ లలోకి మారాల్సి ఉంటుంది. అయితే అందుకోసం ప్రోస్థటిక్స్ మేకప్ ని ప్లాన్ చేశారు. హాలీవుడ్ మేకప్ స్పెషలిస్ట్ గ్యారీ ఓల్డ్ మన్ (డార్కెస్ట్ హవర్ 2017 మూవీ) ని ఈ సినిమా కోసం బరిలో దించుతారట. పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తారని తెలుస్తోంది.మైసూర్ లో షూటింగ్ ప్రారంభించి చెన్నయ్ ముంబై వంటి చోట్ల ఈ తదుపరి షెడ్యూల్స్ ప్లాన్ చేయనున్నారు. అమ్మ బయోపిక్ అంటేనే ఓ ఛాలెంజ్. కథలో పాత్ర చిత్రణలో ఏం తేడా జరిగినా తంబీలు తాట తీస్తారని ఇదివరకూ విజయేంద్రుడు సందేహం వ్యక్తం చేశారు. అందుకే స్క్రిప్టు దశలోనే చాలానే గ్రౌండ్ వర్క్ చేశారట. జయలలిత స్టెల్లా మేరీస్ (చెన్నయ్) కాలేజ్ లో చదువుకునేప్పుడే నటనపై ఆసక్తితో ముఖానికి రంగేసుకున్నారు. అటుపై కథానాయికగా రాజకీయ నాయకురాలిగా చరిత్ర అంతా తెలిసిందే. ఆస్పత్రి బెడ్ పై ఉన్నప్పుడు పొలిటికల్ హైడ్రామా హైలైట్ అయ్యింది. ఇవన్నీ ఈ బయోపిక్ లో చూపించనున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...