వర్మ నుండి మళ్లీ అలాంటి సినిమాలు చూడలేమా?

Cene-Critics-on-About-Ram-Gopal-Varma-Andhra-Talkies
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేసి ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈయన కెరీర్ ఆరంభంలో తీసిన సినిమాలు ఒకొక్కటి అద్బుతాలు.. ఆణిముత్యాలు అని చెప్పుకోవచ్చు. తెలుగులో శివ సినిమా ఒక ట్రెండ్ ను సెట్ చేస్తే హిందీలో 'సత్య' చిత్రం బాలీవుడ్ స్థితినే మార్చేసింది. షోలే స్థాయి సక్సెస్ అంటూ బాలీవుడ్ ప్రముఖులు కూడా సత్యను పొగడ్తలతో ముంచెత్తారు. అంతటి గొప్ప సినిమాలను అందించిన వర్మ ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో చెప్పనక్కర్లేదు.

చెత్త సినిమాలు.. ప్రయోగాత్మక సినిమాలు అంటూ ఏకంగా పోర్న్ సినిమాలను కూడా వర్మ తీస్తున్నాడు. తాజాగా వర్మ తీసిన 'సత్య' సినిమా 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బాలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆ చిత్ర మధుర గుర్తులను నెమరవేసుకున్నారు. సత్య సినిమా హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు కూడా ఇన్సిపిరేషన్ గా నిలిచింది. అలాంటి సినిమాలు తీసిన వర్మ కాస్త శ్రద్ద పెడితే మంచి సినిమాలు తీయగలడు. కాని వర్మ ఎందుకు ఆఫీసర్.. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వంటి చెత్త సినిమాలు తీస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


వర్మలో ప్రతిభ ఉన్నా కూడా ఆయన దాన్ని సరిగా ఉపయోగించడం లేదా అంటూ ఆయన అభిమానులు అంటున్నారు. కాస్త ఓపికగా ఆయన స్క్రిప్ట్ పై కూర్చుని శ్రద్దతో సినిమాను తీస్తే ఆ సినిమా మళ్లీ సంచలనంగా నిలవడం ఖాయం అంటూ ఆయన అభిమానులు నమ్మకంగా ఉన్నారు. కాని కొందరు మాత్రం వర్మ నుండి మునుపటి తరహాలో అద్బుతాలను ఆశించడం అతి అవుతుందని.. ఆయన సినిమాలు సక్సెస్ అవుతాయని ఆశించడం అత్యాశ అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్మ నుండి ముందు ముందు రాబోతున్న సినిమాలు కూడా సక్సెస్ అవుతాయనే నమ్మకం లేదని.. ఆయన మళ్లీ గతంలో తీసినటువంటి ట్రెండ్ సెట్టర్ చిత్రాలను తీస్తాడనే నమ్మకం లేదంటూ వర్మ అభిమానులు ఒకింత అసహనంతో సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఎలాంటి సినిమాలు తీసినా కూడా ఆయన వ్యక్తిత్వంకు తాము అభిమానులమే అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా ఆయనపై ఉన్న అభిమానంను చూపుతున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...