నెట్ ఫ్లిక్స్ కు ఓ బేబీ.. అమెజాన్ నో బేబీ!

Oh-Baby-Becomes-Costly-On-Digital-Space-Andhra-talkies
నందిని రెడ్డి దర్శకత్వంలో సమంతా లీడ్ రోల్ లో నటించిన 'ఓ బేబీ' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ఇప్పటికే హిట్ టాక్ వచ్చింది. అయితే ఎంత పెద్ద హిట్  సినిమా అయినా కొద్ది రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లోకి రావాల్సిందే. 'ఓ బేబీ' కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఈమధ్య మరీ సినిమా రిలీజ్ అయిన ముప్పై రోజులకే స్ట్రీమింగ్ చేయకుండా.. 50 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతలు ఒక రూల్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.  దీంతో ఇంట్లో సినిమా చూడాలనుకునే వారు 50 రోజులు వేచి చూడాల్సిందే.

ఫిలిం మేకర్స్ ఎన్ని ఎత్తులు వేసినా.. ఎన్ని రకాల ప్రమోషన్స్ చేసినా కొందరు కఠిన హృదయులైన ప్రేక్షకులు మాత్రం థియేటర్ కు పోకుండా ఇంట్లోనే చూడాలని మంకుపట్టుతో ఉంటారు. ఇక కొందరేమో తమ అభిమాన నటీనటుల సినిమాలను అమెజాన్ కే ఎక్కువమంది వినియోగదారులు ఉన్నారు. మాటిమాటికీ చూసి మళ్ళీ మళ్ళీ ఆ సినిమాను ఎంజాయ్ చేయ్యాలనుకుంటారు. వారందరూ అమెజాన్ ప్రైమ్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు.  'ఓ బేబీ' విషయంలో కూడా ఇప్పుడు అలాంటి ప్రేక్షకులు కొందరు ఉంటారు కదా. వారికి ఈసారి నిరాశ తప్పదు.


ఎందుకంటే 'ఓ బేబీ' కి ఎక్స్ క్లూజివ్ స్ట్రీమింగ్ పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్.  దీంతో అమెజాన్ సబ్ స్క్రైబర్లకు 'ఓ బేబీ' ని చూసే అవకాశం లేదు.    తెలుగులో దాదాపుగా పెద్ద సినిమాలన్నీ అమెజాన్ వారే రైట్స్ తీసుకుంటూ ఉండడంతో 'ఓ బేబీ' కూడా అమెజాన్ లో వస్తుందని కొందరు డిఫాల్ట్ గా అనుకున్నారు.  నెట్ ఫ్లిక్స్ తో పోలిస్తే అమెజాన్ కు ఫీజ్ చాలా తక్కువ కావడంతో అమెజాన్ కే ఎక్కువమంది వినియోగదారులు ఉన్నారు.   ఇప్పుడు వారందరికీ 'ఓ బేబీ' మిస్ అయినట్టే.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...