నోరు పారేసుకుని అడ్డంగా బుక్కయిన కంగన!

Press-Club-of-India-Supports-Boycott-of-Heroin-Kangana-Ranaut-Andhra-Talkies
అయినదానికి కాని దానికి నోరు పారేసుకుంటే ఆ పరిణామం ఎలా ఉంటుందో ఇన్నాళ్టికి తెలిసొచ్చింది కంగనకు. తొందరపాటుతో నోరు జారింది. అది కూడా తనకు ప్రచారం చేసి ఇంతటి దానిని చేసిన మీడియానే తూలనాడింది. ఎదురు కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడింది. జర్నలిస్టులు ద్రోహులు.. సంఘంలో చెదలు.. సూడో సెక్యులరిస్టులు.. అంటూ ఒంటి కాలిపై చిందులేసింది. జర్నలిస్టుల్ని నేరస్తులు అని ప్రచారం చేస్తూ.. నేర పూరిత ప్రవర్తనతో బెదిరింపులకు పాల్పడ్డారంటూ కోర్టుల పరిధిలో పోరాటానికి సిద్ధమైంది. తనని బహిష్కరించడం నేరపూరితమైన చర్య.. అందుకు జర్నలిస్టులు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సవాల్ విసిరింది.

ఈ అడ్డగోలు వ్యవహారంతో కంగన ఎరక్కపోయి ఇరుక్కుపోయింది. ఎంటర్ టైన్ మెంట్ జర్నలిస్ట్స్ గిల్డ్ - ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా కంగనను బహిష్కరించడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో కంగన అడ్డంగా బుక్కయ్యింది. ఇక కంగనకు.. ఆమె సోదరి రంగోలికి ఇలా అసభ్యంగా అనాగరికంగా మాట్లాడే అలవాటు ఉందని జర్నలిస్టులంతా ఏకమై ఎటాక్ చేయడంతో సీన్ మొత్తం రివర్సులో ఉందిప్పుడు. ఈ నేపథ్యంలో  కంగన నటించిన `జడ్జిమెంటల్ హై క్యా` రిలీజ్ పరిస్థితి ఏంటి?  కంగన వ్యవహారంతో జర్నలిస్టులు ఇప్పుడు ఈ సినిమాపైనా ప్రతీకారం తీర్చుకుంటారా? అన్న కొత్త సందేహాలకు తావిచ్చినట్టయ్యింది.ఇంత చేసినా కంగనను విడిచిపెట్టేయాలని భావించాలంటే ఇక్కడో మెలిక జర్నలిస్టులకు అడ్డంకిగా మారింది. తనపై బహష్కరణ పిలుపును ఉపసంహరించుకోకపోతే కోర్టుకు వెళతానని వార్నింగ్ ఇవ్వడమే గాకుండా తనకు జర్నలిస్టులు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరింది. అయితే ఇది ఈగోని టచ్ చేయడమే. దీంతో ఇప్పట్లో ఈ గొడవ సద్ధుమణుగుతుందా.. అన్నది సందిగ్ధమేనన్న మాటా వినిపిస్తోంది.

జర్నలిస్టులు మార్గదర్శకాల్ని ఉల్లంఘించారు. తన కార్యక్రమాలను జర్నలిస్టులు బహిష్కరించడం ద్వారా సినిమా మార్కెట్తో తనకున్న అవకాశాలను దెబ్బతీయడం ద్వారా పోటీ చట్టాన్ని ఉల్లంఘించారని.. బహిష్కరించడమనేదే నేరపూరితమైన బెదిరింపు.. దౌర్జన్యంగా డబ్బులు లాగడమని.. ఈ మూడో అంశం కింద జైలు శిక్ష పడుతుందని జర్నలిస్టుల్ని కంగన బెదిరించింది. ఒక బలమైన గ్రూపు తనని అడ్డగిస్తోందని కంగన బలమైన వాదన వినిపిస్తున్నా.. అసలు జర్నలిస్టులు కార్పొరెట్ కాంపిటీషన్ పరిధిలోకి రారు. ఇది మార్కెట్ కి సంబంధించిన వ్యవహారం కాదు. పైగా జర్నలిస్టులు కంగనను కేవలం క్షమాపణ కోరారు తప్ప ఎక్కడా డబ్బు డిమాండ్ చేసిందే లేదు. అందువల్ల కంగన వినిపించే వాదన కోర్టుల్లో చెల్లదని చట్టాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి కంగన ఎరక్కపోయి ఇలా ఇరుక్కుపోయిందా? అంటూ ఆసక్తికర చర్చకు ఈ ఎపిసోడ్ తావిచ్చింది. కాంపిటేషన్ చట్టంలోని 4వ సెక్షన్ కింద జర్నలిస్టులకు వ్యతిరేకంగా నోటీసులు జారీ చేయడం విడ్డూరమని విశ్లేషిస్తున్నారు. జర్నలిస్టులను ఆమె ఆడిపోసుకోవడం చూసి ఆవిడకేమైనా మెంటలా? అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...