సాహో: ఐటెమ్ భామ ఈ ఇద్దరిలో ఒకరేనా?

Star-Heroine-in-Prabhas-Saaho-Movie-Item-Song-Andhra-Talkies
డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా 'సాహో' ఆగష్టు 15 రిలీజ్ కానుంది.  దీంతో ఇప్పటికే కౌంట్ డౌన్ బిగిన్ కూడా అయింది.  ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించుకోనవసరమే లేదు కానీ 'సాహో' లో ఐటెం సాంగ్ గురించి గత కొద్ది రోజులుగా చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి.. వాటి గురించి మనం మాట్లాడుకోవల్సిందే.

ఈ సినిమాలో హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సులు.. రియలిస్టిక్ ఫీల్ తో ఉండే చేజింగ్ ఎపిసోడ్స్ మాత్రమే కాదు ఒక సిజ్లింగ్ ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారట.  అయితే ఈ ప్రత్యేక గీతానికి నర్తించే భామ ఎవరనేదానిపై జోరుగా కథనాలు వస్తున్నాయి. మొదట ఈ ఐటెం సాంగ్ కు స్టెప్పులు వేసే భామ ఎవరో కాదు.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అన్నారు. కానీ తర్వాత బాలీవుడ్ హాటీ కత్రీనా కైఫ్ పేరు కూడా వినిపించింది.  ఈ లిస్టు ఇంతటితో ఆగలేదు.. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు ఎవరివో తెలుసా? గీత మేడమ్.. లస్టు భామ.  అర్థం కాలేదా.. రష్మిక మందన్న.. కియారా అద్వాని.  వీరిద్దరిని ఈ స్పెషల్ సాంగ్ కోసం 'సాహో' మేకర్స్ సంప్రదించడం జరిగిందని.. కియారా నుంచి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు.


అయితే ఇంకా చర్చల్లో ఉన్నారు కాబట్టి ఐటెం బ్యూటీ ఎవరినే విషయం మాత్రం ఫైనలైజ్ కాలేదని సమాచారం.  మరో వారం రోజుల్లో ఈ ఐటెం భామ విషయంలో క్లారిటీ వస్తుందని అంటున్నారు. అప్పటిదాకా ఓపిక పట్టక తప్పేలా లేదు!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...