ఈ పరిస్థితుల్లో కృష్ణ గారు మహేష్ వద్ద ఉండటం ఉత్తమం!

Superstar-Krishna-after-Vijaya-Nirmala-Death-Andhra-Talkies
సూపర్ స్టార్ కృష్ణ గారు విజయ నిర్మల మరణంతో ఒంటరి వారు అయ్యారని.. శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటిగా వారిద్దరు ఇన్నాళ్లు బతికారంటూ ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు అన్నారు. కృష్ణ మరియు విజయ నిర్మలను దగ్గర నుండి చూసిన ఇమంది రామారావు తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. బతికినంతకాలం ఇద్దరు కూడా ఒక్కటిగా బతికారు. అందుకే ఆమె మరణంను కృష్ణ జీర్ణించుకోలేక పోతున్నారు.

ఆమె మరణంతో ఖచ్చితంగా కృష్ణ చాలా కోల్పోయారు. ప్రస్తుతం కృష్ణగారి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఆయన టైంకు విశ్రాంతి తీసుకోవాలి.. మందులు వేసుకోవాలి... ఆహారం తీసుకోవాలి. లేదంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం. ఆ విషయం తెలిసి కూడా ఆయన విజయ నిర్మల మరణంతో క్రుంగి పోయి తన రోజు వారి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తన ఆరోగ్యంను కూడా లెక్క చేయకుండా బాధ పడుతున్నారు. ఆయన పరిస్థితి చూస్తుంటే ప్రాణాలపై ఆశను వదిలేసినట్లుగానే అనిపిస్తుంది. ప్రస్తుతం ఆయనకు మంచి తోడు కావాలి. ఆయన్ను కంటికి రెప్పలా చూసుకునే కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆయనకు అవసరం.


ప్రస్తుతం ఇందిర దేవిగారు కూడా అనారోగ్యంతో ఉన్నారు. ఆమె పరిస్థితి సరిగా లేదు. ఆమెనే వేరే వారు చూసుకోవాల్సి ఉంది. అలాంటి ఆమె కృష్ణ గారిని చూసుకోవడం కష్టం. అందుకే ఈ సమయంలో మహేష్ బాబు వద్ద కృష్ణ గారు ఉండటం ఉత్తమం. ఎందుకంటే కృష్ణ గారికి అత్యంత ఇష్టమైన కొడుకు మహేష్. తన పేరును నిలబెట్టిన కొడుకు అంటూ మహేష్ పై కృష్ణకు అభిమానం ఉంది. ఆ అభిమానంతోనే ఆ కుటుంబంతో కృష్ణ ఈజీగా కలిసి పోతారు. దాంతో పాటు నమ్రత గారు మహేష్ బాబు గారి పిల్లలు కూడా కృష్ణ గారి పరిస్థితిని బాగు చేసేందుకు హెల్ప్ అవుతారంటూ ఇమంది రామారావు అన్నారు. ప్రస్తుతానికి కృష్ణ ఒంటరిగానే ఉంటున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...